భారత్‌ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు ముందుగా అహ్మ‌దాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా గాంధీజీ 12 సంవ‌త్స‌రాల పాటు ఉన్న స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మానికి చేరుకున్నారు. అక్క‌డ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ గాంధీజీ ఎలా ఉన్న‌ది ?  ఏం చేసింది ? అన్న విష‌యాలు వివ‌రించారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ మహాత్ముడి చిత్రపటానికి నూలుమాల వేసి నివాళులర్పించారు.

 

ఈ క్ర‌మంలోనే గాంధీ చ‌ర‌కా ద్వారా ఏం చేసింద‌న్న విష‌యాలు సైతం అక్క‌డ మీడియేట‌ర్ల ద్వారా ట్రంప్ తెలుసుకున్నారు. ట్రంప్‌, మెల‌నియా ఇద్ద‌రూ చ‌ర‌కా తిప్పారు. ఆ త‌ర్వాత గాంధీ కూర్చొన్న ప్ర‌దేశానికి ట్రంప్ దంప‌తుల‌ను తీసుకు వెళ్లిన మోడీ అక్కడ ఓ రెండు నిమిషాల పాటు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రత్యేకత, గాంధీ అనుసరించిన జీవన విధానాలను ట్రంప్‌ దంపతులకు మోదీ వివరించారు.

 

అనంత‌రం ఆశ్ర‌మంలో గాంధీజీ వాడిన వ‌స్తువుల గురించి తెలుసుకున్న ట్రంప్ దంప‌తులు సబర్మతీ ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో సైన్ చేశారు. ముందుగా ట్రంప్‌ సందేశం రాసి సంతకం చేశారు. ఈ పేజ్‌లో అద్భుతమైన ప్రియమిత్రుడు ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలంటూ పేర్కొన్నారు. త‌న‌ను మోదీ ఇక్క‌డ‌కు ఆహ్వానించ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని.. ఈ భార‌త ప‌ర్య‌ట‌న త‌మ కుటుంబానికి అద్భుత‌మైంద‌న్నారు.

 

ఆ త‌ర్వాత ట్రంప్ భార్య ఇవాంకా కూడా ఆ సంద‌ర్శ‌కుల పుస్త‌కంలో త‌న అనుభ‌వాల‌తో పాటు ఆమె కూడా సైన్ చేశారు. సబర్మతి ఆశ్రమం నుంచి మొతెరా స్టేడియంలో జరగనున్న 'నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్లారు. ఇక ఆగ్రా వెళ్లే ట్రంప్ ఫ్యామిలీ అక్క‌డ ముందుగా షాజ‌హాన్ త‌న భార్య ముంతాజ్ మ‌హాల్ ప్రేమ‌కు చిహ్నంగా నిర్మించిన తాజ్‌మ‌హాల్‌ను సంద‌ర్శిస్తారు. అక్క‌డ తాజ్‌మ‌హాల్ గొప్ప‌త‌నం గురించి ఆయ‌న‌కు వివ‌రిస్తారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఢిల్లీలోని మౌర్య హోట‌ల్లోని 14వ అంత‌స్తులో బ‌స చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: