రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానులని అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తూ రెండు నెలల పై నుంచి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఈ రాజధాని ప్రభావం గుంటూరు జిల్లాలో ఎక్కువగానే ఉంది. పైగా  జిల్లాలో ఒక రేపల్లె ఎమ్మెల్యే తప్ప మిగతా వారంతా వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇప్పుడు వారు ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులకు కట్టుబడి ఉండటం వల్ల, అక్కడి ప్రజలు వారిపై కాస్త ఆగ్రహంగా ఉన్నారు.

 

ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందులో కమ్మ సామాజికవర్గానికి చెందిన పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరావుకు కూడా ఈ అమరావతి సెగ ఉంది. కాకపోతే ప్రజలు పైకి ఆయనపై వ్యతిరేకిత కనబర్చకపోయిన, లోపల మాత్రం ఆగ్రహంగానే ఉన్నారు. పైగా అసలు అమరావతి ప్రాంతం ఈయన నియోజకవర్గంలోనే ఉండటంతో, నంబూరుకు కాస్త ఇబ్బందికర వాతావరణమే ఉంది.

 

అయితే అమరావతి ఇష్యూ పక్కనబెడితే, ఈయన నియోజకవర్గంలో బాగానే పని చేస్తున్నారు. మొన్న ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగిన నంబూరు..టీడీపీ సీనియర్ నేత కొమ్మాలపాటి శ్రీధర్‌ని ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక గెలిచిన దగ్గర నుంచి ప్రతిరోజూ షెడ్యూల్ పెట్టుకుని నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు, రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు చేపడుతున్నారు.

 

తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా సాయం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన వారికి పథకాలు అందేలా చేస్తున్నారు. కాకపోతే వైసీపీలో కమ్మ ఎమ్మెల్యేగా ఉన్న నంబూరు, ప్రతిపక్ష టీడీపీ మీద అంత దూకుడుగా విమర్శలు చేసిన సందర్భాలు పెద్దగా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: