ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మొదటిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తుండటంతో  దేశవ్యాప్తంగా ఆసక్తి సంతరించుకుంది. కాగా ట్రంప్ కుటుంబ సమేతంగా రెండు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. ఇక ఈ రోజు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సబర్మతీ ఆశ్రమానికి చేరుకుని అక్కడి నుంచి మోతేర  స్టేడియం కి వెళ్లి నమస్తే  ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఇక అక్కడ నమస్తే ఇండియా అంటూ ట్రంప్  భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఆయన వ్యాఖ్యానించారు. ఇక తన ప్రసంగానికి కాస్త లోకల్ టచ్ చేస్తూ ప్రజలను ఆకర్షించే విధంగా ప్రసంగం చేశారు. 

 

 

 ఈ సందర్భంగా అమెరికా-భారత్ మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్... అదేవిధంగా భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన నిజమైన స్నేహితుడు అంటూ వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు... ఉగ్రవాదం పై కూడా విమర్శలు చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని రూపుమాపి శాంతిని నెలకొల్పాల్సిన  అవసరం ఎంతైనా ఉంది వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భారత్లో కూడా వీరాభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరిలో ఒకానొక వీరాభిమాని బుస్సా కృష్ణ. గతంలో ట్రంపు విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాలాభిషేకాలు రుద్రాభిషేకాలు చేయడంతో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచాడు కృష్ణ. 

 

 

 ఇక ట్రంప్ భారత్లో పర్యటిస్తుడటంతో  ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన కృష్ణ..తాను  దేవుడిగా పూజించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ఇండియాకు రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. జనగామ కు చెందిన బుస్సా కృష్ణ ఆరడుగుల ట్రంప్  విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను  దేవుడిగా భావించే డోనాల్డ్ ట్రంప్ ఇండియా కు రావడం సంతోషాన్ని కలిగిస్తుంది అంటూ తెలిపారు. త్వరలోనే తాను డోనాల్డ్ ట్రంప్ నువ్వు కలుసుకుంటాను అనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తీవ్రవాదాన్ని రూపుమాపడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారు అంటూ కృష్ణ కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: