రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' సభలో పాల్గొని అనేక అంశాల గురించి ప్రస్తావించారు. ఈ సభకి ఒక లక్షా 25 వేల మంది ప్రజలు హాజరయ్యారు. అయితే ఇంతమంది ప్రజల సాక్షిగా డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ... భారతదేశానికి తమ గుండెల్లో స్థానం ఉంటుందని, అమెరికా భారతదేశాన్ని ప్రేమిస్తుందని, భారతదేశం అమెరికాకి ఎప్పటికీ మిత్ర దేశమేనని ఆయన అన్నారు. ఆ తర్వాత అత్యద్భుతమైన ఆగ్రా లోని తాజ్ మహల్ కి చేరుకొన్న డోనాల్డ్ ట్రంప్ తన భార్య మెలానియా తో కలిసి 45 నిమిషాల పాటు దర్శించి, అందమైన తాజ్ మహల్ గురించి తమ అనుభవాన్ని ఒక విజిటర్ బుక్ లో రాసుకొచ్చారు. 17వ శతాబ్దపు మొగలుల తాజ్ మహల్ యొక్క ప్రత్యేకతను వివరించడానికి ఒక గైడ్ ని కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉత్తర్ ప్రదేశ్ సంస్కృతి ఉట్టిపడేలా ఎంత మంది కళాకారులు డోనాల్డ్ ట్రంప్ కోసం విమానాశ్రయంలో ఎన్నో ప్రదర్శనలు చేశారు.




అయితే, డోనాల్డ్ ట్రంప్ ని ఇండియాకి ఘనంగా స్వాగతించడానికి, ఇంకా అతడిని ఇంప్రెస్స్ చేయడానికి చాలా కోట్లు ఖర్చు పెట్టి మన ప్రభుత్వం డెకరేషన్లు, అలంకరణలు ఇలా ఎన్నో ఏర్పాట్లను చేసింది. అలాగే ట్రంప్ కోసం తాజ్ మహల్ ని కూడా సర్వాంగ సుందరంగా అలంకరించింది. ముఖ్యంగా గుజరాత్ ప్రభుత్వం ప్రతి రోడ్డుని శుభ్రపరిచి, మురికివాడలని కనిపించకుండా ఏర్పాటులు చేసి, రోడ్డు పొడుగుతూ పామ్ చెట్లను నాటించింది.



అయితే ట్రంప్ రాక కోసం అట్టహాసంగా భారతదేశంలో జరుగుతున్న ఏర్పాట్లపై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో వరుస ట్వీట్స్ చేసి నెట్టింట పెద్ద దుమారమే రేపుతున్నాడు. మొట్టమొదటిగా ట్రంప్ కోసం మన ఇండియా కొన్ని వేల కోట్లు ఖర్చు చేసి స్వాగతిస్తోంది, కానీ మన మోడీని స్వాగతించడానికి అమెరికా ఒక్క రూపాయి బిళ్ళ అయినా ఖర్చు చేస్తుందా? అని ప్రశ్నించారు. అలాగే ప్రధాన నరేంద్ర మోడీ ట్రంప్ కోసం కోటి మంది ప్రజలు తరలివస్తారని అబద్ధం చెప్పి అతని బలహీనతతో ఆడుకున్నారని, కోటి మంది అని చెప్పితే ఒక లక్ష మంది తప్ప ఎక్కువమంది రాలేదని, దీంతో ట్రంప్ అలిగి ట్రేడ్ డీల్ క్యాన్సిల్ చేస్తారని, అసలే ట్రంప్ ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి అని నెట్టింట ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇతను చేసిన ట్వీట్లకి ఘాటుగా కామెంట్లు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: