ఇపుడిదే విషయం తెలుగుదేశంపార్టీ నేతల్లోనే కాదు జనాల్లో కూడా బాగా చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన మూడు రోజులుగా ఇఎస్ఐ స్కాం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. టిడిపి హయాంలో జరిగిన దాదాపు వెయ్యి కోట్ల రూపాయల స్కాంలో ఇద్దరు మాజీ  మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ నివేదికలో మంత్రులుగా చేసిన ఇద్దరి పేర్లు ప్రముఖంగా ఉందని సమాచారం.

 

సరే ఎవరు కూడా తమపై వినిపిస్తున్న ఆరోపణలు నిజమే అని కుంభకోణానికి పాల్పడ్డామని అంగికరించరు కదా ? ఇపుడు మాజీ మంత్రులు కూడా అలాగే వాదిస్తున్నారు. అయితే రెండు రోజులు గడచిన తర్వాత ఒక్కసారిగా నారా లోకేష్ పేరు కూడా బయటకు వచ్చింది. మంత్రులపై ఒత్తిడి పెట్టి వాళ్ళపై సంతకాలు చేయించింది లోకేషే అన్నది ప్రచారం సారాంశం. దాంతో స్కాంలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నది మాజీ మంత్రులే అయినా అసలు సూత్రధారి మాత్రం లోకేషే అన్న విషయం కలకలం రేపుతోంది.

 

దాంతో లోకేష్ పాత్రపైన కూడా వెంటనే విచారణ జరపాలంటూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. సరే  ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఇప్పటికే చంద్రబాబునాయుడుపై ఎన్ని ఆరోపణలున్నాయో అందరికీ తెలిసిందే. ఇన్ సైడర్ ట్రేడింగ్, పోలవరం అవినీతి.. ఇలా చెప్పుకుంటూపోతే చాలా స్కాంలే ఉన్నాయి చంద్రబాబుపై. ఇవన్నీ చాలవన్నట్లు మొన్ననే మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ పై ఐటి సోదాలు, తర్వాత పరిణామాలు.

 

అంటే ఎందులో అయినా చంద్రబాబుపై కేసులు పెట్టి ఏరోజైనా అరెస్టు చేయచ్చనే ప్రచారం అందరికీ తెలిసిందే.  ఇందుకనే చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర మొదలుపెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి లేండి. పైగా తనను అరెస్టు చేయచ్చని చంద్రబాబే స్వయంగా ఎప్పటి నుండో బహిరంగ  సభల్లోనే ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంటే తాను అరెస్టవుతానన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. ఇపుడిదే అంశం పార్టీ నేతల్లోనే కాదు జనాల్లో కూడా నలుగుతోంది. తండ్రి, కొడుకుల్లో ముందు ఎవరు అరెస్టవుతారనే చర్చ రోజు రోజుకు పెరిగిపోతోంది. చూద్దాం ముందు ఎవరి కోరిక తీరుతుందో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: