అమరావతి ఆంధ్రుల కలల రాజధానిగా చెప్పుకోవడం కంటే టిడిపి అధినేత చంద్రబాబు ఊహల రాజధానిగా అమరావతిని చెప్పుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తరువాత ఏపీలో రాజధానిని ఎక్కడ నిర్మించాలి అనే విషయమై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రకరకాల ప్రాంతాలు రాజధానిగా పరిశీలనకు వచ్చాయ. రాజధానిగా ఏ ప్రాంతం అయితే బాగుంటుంది అనేది సమగ్రంగా పరిశీలించేందుకు శివరామకృష్ణ కమిటీ ని కూడా చంద్రబాబు నియమించారు. అమరావతి విషయమై ఆ కమిటీ పలు అభ్యంతరాలు తెలిపినా ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకే అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. 


దీనిపై ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమయినా చంద్రబాబు మాత్రం ఆ విషయంలో వెనక్కి తగ్గకుండా అమరావతి రాజధానిగా ప్రకటించడమే కాకూండా తాత్కాలిక బిల్డింగులను నిర్మించి, శాశ్వత బిల్డింగులు ఇవేం అంటూ రకరకాల గ్రాఫిక్స్ డిజైన్స్ జనాలకు చూపించారు. అయితే శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చంద్రబాబు రాజధాని ప్రకటించలేదని, కేవలం వ్యక్తిగత లాభం కోసం సొంత ఎజెండా కోసమే అమరావతిని రాజధానిగా ప్రకటించారనిపేర్కొంటూ సుప్రీంకోర్టులో తాజాగా ఓ పిటిషన్ దాఖలైంది. అనిల్ కుమార్ బోరుగడ్డ అనే వ్యక్తి ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్ రోహింగ్టన్ నారిమాన్ , జస్టిస్ రవీంద్ర భట్ ఈ కేసు విషయమై హై కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచించారు.


 అమరావతి  విషయంలో ప్రస్తుతం ఏపీలో పెద్ద ఎత్తున జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడం తెలుగుదేశం పార్టీలో కలవరం పుట్టిస్తోంది. శివరామకృష్ణ కృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతిని ఎంపిక చేశారనే విమర్శలు వచ్చాయి వాటిని పట్టించుకోకుండా రాజధాని నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు  అని తెరమీదకు తీసుకువచ్చినా రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ పెద్దఎత్తున టిడిపి ఆందోళన చేస్తోంది. ప్రస్తుత సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ హైకోర్టు కు రాబోతుండడంతో దీనిపై ఎటువంటి తీర్పు వెలువడుతుంది అనే టెన్షన్ చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకుల్లో నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: