ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఒకపక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి చేసుకుంటూ దూసుకుపోతున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి. అమ్మఒడి మరియు రైతు భరోసా పథకాలకు ప్రజల నుండి మాత్రమే కాక జాతీయ స్థాయి నేతల నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదే సమయంలో రివర్స్ టెండరింగ్, దిశ చట్టం కూడా హైలెట్ అవటం మనకందరికీ తెలిసినదే. దీంతో దేశంలో ప్రజలను బాగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులలో దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలో వైయస్ జగన్ కి మూడవ స్థానం రావడం జరిగింది.

 

రోజు రోజుకి జగన్ పరిపాలన గురించి జాతీయ స్థాయిలో హైలెట్ వార్తలు రావడంతో కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా జగన్ పరిపాలన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా దక్షిణాదిలో కీలక రాజకీయ పవర్ సెంటర్ గా జగన్ తయారవడం గ్యారెంటీ అనే టాక్ ఇప్పటి నుండే జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో జగన్ పరిపాలన గురించి దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రముఖ రాజకీయ నేతలంతా ఒకపక్క సంక్షేమాన్ని మరోపక్క విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని సరైన రీతిలో సమానంగా బ్యాలెన్స్ గా చేసుకుంటూ అతి చిన్న వయసులోనే బాగా పరిపాలిస్తున్నారు అని తెగ పొగుడుతున్నారు.

 

దేశంలో ఎలాంటి రాష్ట్రానికైనా సంక్షేమం మరియు అభివృద్ధి అనేది రెండు కళ్ళు లాంటివి అని...చాలా రాష్ట్రాలలో సంక్షేమం బాగా ఉంటే అభివృద్ధి ఉండదని కానీ ఈ రెండు కీలక పాయింట్లలో జగన్ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా పరిపాలిస్తున్నాడు అని దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ స్థాయి నేతలు తెగ పొగుడుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో తనకి ప్రత్యర్ధులు లేకుండా కూడా జగన్ కీలక నిర్ణయాలు తీసుకోవడంతో జాతీయ మీడియాలో దక్షిణాది భారతదేశంలో తిరుగులేని రాజకీయ నాయకుడు జగన్ అనేక కథనాలు ప్రసారమవుతున్నాయి 

మరింత సమాచారం తెలుసుకోండి: