ఎవరైనా అమ్మాయికి పెళ్లి జరుగుతుంది.. పెళ్లి అయ్యాక మొదటి రోజే అబ్బాయి గే అని తెలిస్తే ఎం చేస్తుంది? వెంటనే తల్లితండ్రులకు.. అత్తమామలకు చెప్పి విడాకులు అయినా తీసుకుంటుంది.. లేదా సైలెంట్ గా అయినా ఉంటుంది. కానీ ఓ మహిళా మాత్రం ఆమె భర్త నాలుగేళ్లు ఆమెను ముట్టుకోకపోయిన సహించింది. కానీ అతను మరో పురుషుడితో ఉండటం చూసు తట్టుకోలేకపోయింది ఆ మహిళా.. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి పట్టణానికి చెందిన ఓ యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి నాలుగు సంవత్సరల క్రితం హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ యువతితో పెళ్లి అయ్యింది. ఇక పెళ్లి అయినప్పటి నుండి కూడా భార్యను ఒక్కసారి కూడా ముట్టుకోలేదు.. 

 

సాఫ్ట్ వేర్ కదా.. జాబ్ టెన్షన్ వల్ల భర్త అలా ఉంటున్నాడేమో అనుకుని ఆమె చాలా ఓపిక పడుతూ వచ్చింది.. అయితే నాలుగు సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు లేరు ఏంటి? అంటూ బంధువులు సూటిపోటి మాటలు అని ఆమెను వేధించారు.. కానీ భర్త గురించి ఎవరికి చెప్పలేదు.. అయితే నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చిన ఆమెకు ఇంటికి తాళం వేసి ఉండటం కనిపించింది. 

 

దీంతో ఆమె దగ్గర ఉన్న మరో తలంతో తీసి లోపలి వెళ్ళింది.. అయితే బెడ్ రూమ్ నుండి భయంకర శబ్దాలు వినిపించాయి. దీంతో అనుమానం వచ్చి కిటికీ నుండి చూడగా భర్త మరో యువకుడితో రొమాన్స్ చెయ్యడం కనిపించింది.. షాక్ కి గురైన ఆమె భర్త గే అని తెలుసుకొని బెడ్ రూమ్ కి వెళ్లి అతన్ని నిలదీసింది. 

 

తన నిజస్వరూపం భార్యకు తెలియడంతో ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు.. ఈ విషయం బయట ఎవరికైనా చెప్తే చంపేస్తా అని బెదిరించాడు.. నాలుగేళ్లుగా ముట్టుకోకపోయిన భరించని యువతీ ఆమెపై చిత్రహింసలు చెయ్యడం భరించలేకపోయింది. అందుకే భర్త మరో యువకుడితో సెక్స్ చేస్తున్న సమయంలో పోలీసులకు ఫోన్ చేసి పిలిపించి భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించింది. 

 

దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చెయ్యగా.. భర్త గే అని తెలిసినప్పటికీ మౌనంగా ఉన్నప్పటికీ అలా నిలతీసినందుకు ఆమెపై హత్యాయత్నం చేశాడు అని.. ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని భర్తను విచారిస్తున్నారు. ఇలా ఆ భర్త సంగతి బయట పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: