అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు ఉద‌యం భారత్‌లో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు ట్రంప్‌, ఆయన భార్య మెలానియాతో పాటు ట్రంప్‌కు అడ్వైజ‌ర్‌గా ప‌నిచేస్తున్న ఇవాంకా మ‌రియు ఆమె భ‌ర్త జేర్డ్ కుష్న‌ర్ కూడా వ‌చ్చారు. భారత్‌కు ట్రంప్‌ రావడం ఇదే తొలిసారి. తన పర్యటనతో భారత్, అమెరికాల సంబంధాలు బలపడతాయంటున్న ఆయన రేపు రూ. 21 వేల కోట్ల సైనిక పరికరాల ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. 

 

ఆ ఇద్ద‌రూ ఎవ‌రో కాదు.. కుమార్తె ఇవాంకా ట్రంప్, అల్లుడు జారెద్ కుష్ణర్. ఆయన నిర్ణయం తీసుకున్నా సరే ఆయన వీరిద్ద‌రి సలహా లేకుండా ఒక్క అడుగు కూడా వేయరు.  ఇవాంకా.. అగ్రరాజ్యం అధ్యక్షుడి కుమార్తే కాకుండా ఫ్యాషన్ ఐకాన్ కూడా. డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటి భార్య కుమార్తె ఇవాంకా. ఈమె అసలు పేరు ఇవానా మారీ ట్రంప్ . ఇవానా, ట్రంప్ ముగ్గురి సంతానంలో ఈమె ఒకరు. ఇవాంకా.. తన స్వశక్తితో మోడల్ గా పేరు తెచ్చుకుంది. ఇక ఇవాంకాలోని చురుకుదనం, తెలివితేటలంటే తండ్రి డోనాల్డ్‌ ట్రంప్‌కు బాగా ఇష్టం. అందుకే మిగతా పిల్లల కన్నా ఆమెనే ఎక్కువగా ప్రేమించేవాడు.

 

ఇవాంకాకు కూడా తండ్రి దగ్గర చనువు కాస్త ఎక్కువే. ఒకవైపు మోడలింగ్‌లో బిజీగా ఉంటూనే ఆమె తన తండ్రి వ్యాపారాలపై ఆరా తీస్తూ, అన్ని విషయాలు తెలుసుకుని రియల్ ఎస్టేట్ పై పట్టు పెంచుకుంది. ఇక వ్యాపారంలో అయినా ఎన్నికల ప్రచారంలో అయినా సరే ఆమె సలహాలు కచ్చితంగా తీసుకునే వారు ట్రంప్. తాను ఆర్ధికంగా బలవంతుడ్ని అవ్వడానికి కుమార్తె సలహాలే కీలకం అని భావిస్తారు ఆయన. విద్యార్ధి దశ నుంచే ఇవాంకా ఆయనకు బలంగా మారింది అని చెప్తారు.  ఇవాంకా నిర్ణయాలు కూడా కుండబద్దలు కొట్టినట్లుగా, కచ్చితంగా ఉండేవి.  

 

ఇక అధ్యక్షుడు అయిన వెంటనే ఆమెను తన సలహాదారుగా నియమించుకున్నారు ట్రంప్. అలాగే అల్లుడు జారెద్ కుష్ణర్ ని కూడా సలహాదారుగా నియమించుకున్నారు. ఉగ్రవాదంపై పోరు సహా మధ్యప్రాచ్యంలో ఏ విధంగా వ్యవహరించాలి..? గల్ఫ్ దేశాల విషయంలో తీసుకునే సలహాలు..? ఆఫ్రికాలో అమెరికా వాణిజ్య ఒప్పందాలు… అగ్ర రాజ్యాలతో తీసుకునే జాగ్రత్తలు వంటి వాటిని వీరిద్ద‌రి సలహాతోనే ట్రంప్ ముందుకి వెళ్తారు. ఇలా వాణిజ్య ఒప్పందాలు అయినా, మరొక ఒప్పందం అయినా సరే వీరిద్ద‌రి సలహా లేకుండా ఏదీ జరగదు.

 

 

 
  

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: