అతడు అమెరికా అధ్యక్షుడు కాదు కాదు అంతకు మించి... ప్రపంచానికి రారాజు కాదు కాదు అంతకుమించి... మరి ఏంటి ..? భారతదేశానికి వచ్చిన ఓ విశిష్ట అతిథి. అతిథిని గౌరవించడం మన సంప్రదాయం కాబట్టి ఆయన పర్యటనకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక అమెరికా అధ్యక్షుడు భారత్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇక్కడి ప్రజలకు ప్రతిదీ వింతగానే కనిపిస్తోంది. ఆయనకు సంబంధించిన వ్యవహారాలు, కదలికలు, ప్రసంగాలను తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన తినే ఆహారం దగ్గర నుంచి ఆయన భార్య వేసుకునే బట్టల వరకు ప్రతిదీ వింతగానే చూస్తున్నారు. ఇక ఆయనకు ఇచ్చే బహుమతులు గురించి కూడా ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే అతను మన దేశానికి వచ్చిన విశిష్ట అతిథి కాబట్టి.  అందుకే ఆయనకు అంతగా ప్రోటోకాల్ ఇస్తున్నారు. 


ఇక ట్రంప్ కూడా భారతదేశానికి అంతే ప్రాధాన్యం ఇస్తూ.. సలహాలు సూచనలు తన ప్రసంగాల ద్వారా ఇస్తున్నారు. భారత ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ దేశం చాలా అభివృద్ధి చెందుతుందని, అసలు భారతదేశం అంటే మానవత్వానికి ప్రతీక అంటూ అదే పనిగా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అసలు ప్రతి సంవత్సరం రెండు వేలకు పైగా సినిమాలను నిర్మించే సత్తా ఉన్న గొప్ప దేశం ఇది అని పొగుడుతున్నారు. ఉగ్రవాదం విషయంలో భారత్ అమెరికా రెండూ ఒకటేనని, భారతదేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది అంటూ పొగుడుతున్నారు.


భారత్ అమెరికా ఈ రెండు దేశాలు మంచి స్నేహితులని, ఈ స్నేహం ద్వారా ఎన్నో కొత్త అవకాశాలు సృష్టించబడతాయి అంటూ చెబుతున్నారు. ఇక దేశంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని, ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్నారు అని, అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు దూసుకు వెళ్తున్నారని, ఈ విషయం పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచనలతో కూడిన హెచ్చరికలు చేశారు. ఇక భారత్ అమెరికా దేశాల మధ్య ఈ మధ్యకాలంలో వాణిజ్యం బాగా పెరిగిందని, ఒక దేశానికి మరో దేశం సహకరించుకుంటూ ముందుకు వెళుతుందని, ఈ స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని ట్రంపు తన ప్రసంగంలో చెప్పారు.


ప్రసంగం మొత్తం ట్రంప్ భారత్ అమెరికా మధ్య ఉన్న స్నేహ సంబంధాలను, మోదీ   ప్రభుత్వం గొప్పతనం గురించి చెప్పుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మధ్యాహ్నం ఆయన భారత్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ప్రతి విషయాన్ని ఆసక్తిగా అడిగి తెలుసుకుని తిలకించారు. మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన పర్యటన పై పూర్తిగా సంతృప్తి చెందినట్టుగా ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: