చిరంజీవి 152వ చిత్రంకు కొరటాల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఈ చిత్రంకు ఆచార్య అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారు. టైటిల్‌ విషయంలో క్లారిటీ అయితే రాలేదు. కాని సినిమాలో చిరు ఎలా కనిపించబోతున్నాడు అనే విషయంపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. చిరంజీవి ఎర్ర కండువా వేసుకుని విప్లవ భావాలున్న వ్యక్తి పాత్రలో అయితే కనిపించబోతున్నాడు. కానీ.. కొందరు నక్సలైట్‌ పాత్ర అని కూడా అంటున్నారు.

 

అయితే.. ఈ సినిమాకి సంబందించిన ఒక విషయం పై దర్శకుడు కొరటాల శివ మరియు రామ్ చరణ్ సీరియస్ అయ్యారట. ఇప్పటి వరకైతే సినిమాకు సంబందించిన అన్ని విషయాలలో జాగ్రత్త వహిస్తున్నారట..

 

అయితే.. మొత్తానికి చిరంజీవి లుక్‌ పై క్లారిటీ రావడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో సినిమాలో చిరంజీవి పాత్ర గురించి రివీల్‌ అవ్వడంతో కొందరు పాత సినిమాల్లో మాదిరిగా చిరంజీవి నటించబోతున్నాడా అన్నట్లుగా కామెంట్స్‌ చేస్తున్నారు. దాంతో చిరంజీవి లుక్‌ లీక్‌ అవ్వడం పై దర్శకుడు కొరటాల శివ మరియు నిర్మాత రామ్‌ చరణ్‌ లు చాలా సీరియస్‌ అయ్యారు.

 

 

చిరంజీవి లుక్‌ షూటింగ్‌ స్పాట్‌ నుండి లీక్‌ అయిన కారణంగా ఇకపై షూటింగ్‌లో ఎవరు కూడా ఫోన్స్‌ వాడకూడదని, షూటింగ్‌ ప్రారంభంకు ముందే అందరి ఫోన్ లు ఒక చోట పెట్టాల్సిందిగా దర్శకుడు కొరటాల శివ సీరియస్‌ గా ఆదేశాలు జారీ చేశారు. మరోసారి ఇలాంటివి జరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని,. పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందంటూ కొరటాల యూనిట్‌ సభ్యులను హెచ్చరించాడట.

 

 

కాగా., మెగా స్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా ఘన విజయం సాధించిన ఉస్తాహంలో మరో భారీ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: