అసలు ఈ రోజుల్లో చికెన్ లేకుండా మటన్ లేకుండా ఫిష్ లేకుండా ఏ పని జరగడం లేదు. చిన్న కార్యక్రమం ఉన్నా ఇంట్లో ఎం జరుగుతున్నా సరే సరే నాన్ వెజ్ లేకుండా ఏమీ జరగడం లేదు. ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువైపోయింది. అయితే ఒక చోట మాత్రం ఇప్పుడు చికెన్ అంటే చాలు జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. అవును ఇప్పుడు చికెన్ తినాలి అంటే భయపడుతున్నారు అక్కడ. దానికి కారణం కోళ్ళు వరుసగా చనిపోవడమే. వేల కోళ్ళు ఇప్పుడు వైరస్ సోకి మరణిస్తున్నాయి. 

 

ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అసలు ఎందుకు వైరస్ సోకుతుందో అసలు ఎం జరుగుతుందో అర్ధం కాక పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు పోసి పౌల్ల్త్రీ యజమానులు ఫారాలు వేసారు. ఇప్పుడు కోళ్ళు ఇలా మరణించడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. చిన్నా పెద్ద రైతులు అందరూ కూడా ఈ దెబ్బకు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో వేల కోళ్ళు గత నాలుగు రోజులుగా చనిపోతున్నాయి. 

 

దానికి తోడు మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా వారిని ఆందోళనకు గురి చేస్తుంది అనే చెప్పవచ్చు. దీనితో జనం ఇప్పుడు చికెన్ తినాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం. కొంత మంది కోళ్ళను చంపేస్తున్నారు. వైరస్ సోకింది అనే ప్రచారం నేపధ్యంలో వాటిని జనం తినకూడదు అనడంతో అవి ఎగుమతి అవ్వడం లేదు. దీనితో ఇప్పుడు రైతులు భారీగా నష్టపోతున్నారు. చిన్న ప్రచారం జరిగితేనే ఎక్కువగా ఆలోచించే మన జనం, ఇప్పుడు ఈ పరిణామం తో మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పౌల్ట్రీ నష్టాల్లో ఉంది. ఈ పరిణామం దెబ్బకు మరింతగా నష్టపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: