టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా తెలిసిందే. ఎన్నో ఏళ్ళు చంద్రబాబు శిష్యుడుగా రాజకీయాలు చేసి, తెలంగాణలో కీలక నేతగా ఎదిగిన రేవంత్, తర్వాత పార్టీ పరిస్తితి మరి దారుణంగా తయారవ్వడంతో కాంగ్రెస్‌లోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్‌లోకి వెళ్ళిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి ప్రయాణం ఎలా సాగుతుందో చూస్తూనే ఉన్నాం. అయితే రేవంత్ కాంగ్రెస్‌లో ఉన్న, చంద్రబాబు మీద అభిమానం మాత్రం పోలేదు ఏదొక సందర్భంలో ఆయన మీద అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు.

 

ఓ రకంగా 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకోవడంలో రేవంత్ హస్తం ఎంత ఉందనేది కూడా తెలుసు. ఇక అదే పొత్తు వల్ల ఏం జరిగిందో, ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు కూడా వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పొత్తు పోయిన, రేవంత్ మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలవడానికి టీడీపీ కేడర్ ఏ మేర సాయం అయిందో కూడా చూశాం. ఈ విధంగా చంద్రబాబు-రేవంత్‌ల మధ్య అనుబంధం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా, రేవంత్ ఓ విషయంలో తన గురువునే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది.

 

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం పాలన సరిగా లేదని చెబుతూ, రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్య యాత్ర పేరుతో తిరుగుతున్నారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ముందుకెళుతున్నారు.అలాగే నియోజకవర్గాల్లో ఆయా టీడీపీ నేతలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు.

 

సరిగా ఇదే సమయంలో రేవంత్ కూడా తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మీద పోరాటం మొదలుపెట్టారు. కేసీఆర్ సర్కార్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి, మోసం చేసిందని చెబుతూ, పట్నం గోస పేరుతో తన పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో తిరుగుతున్నారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుని, కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిందని చెబుతూ ముందుకెళుతున్నారు. ఇలా అటు ఏపీలో చంద్రబాబు జగన్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే, ఇటు రేవంత్ కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: