అమ్మాయిలు మాట్లాడుతుంటే అబ్బాయిలు చాలా మంది సొల్లు కారుస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే.. అలా అబ్బాయిల వీక్ నెస్ తో కొందరు అబ్బాయిలు అమ్మాయిల లాగా చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కొందరు అబ్బాయిలు అమ్మాయిల చాట్ చేస్తూ అబ్బాయిలను అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి. అవేంటో చూద్దాం.. 

 


అమ్మాయిల గొంతుతో అబ్బాయిలను ప్రలోభ పెడుతూ.. వారి వద్ద నుంచి బలవంతపు వసూళ్లు చేస్తోన్న ఓ వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ చాట్ పేరుతో అమ్మాయిలా మాట్లాడుతూ అబ్బాయిలను ముగ్గులోకి దింపే ఆ వ్యక్తి.. ఆపై లైంగిక వేధింపుల పేరుతో రివర్స్ గేమ్ మొదలుపెడుతాడు. పోలీసులకు ఫిర్యాదు చేశానంటూ కంప్లైంట్ కాపీని కూడా పంపిస్తాడు. దీంతో భయపడిపోయి అతను అడిగినంత డబ్బులు ఇచ్చి చాలామంది మోసపోయారు. 

 

 

ఓ జాబ్స్ వెబ్‌సైట్‌లో పాప్-అప్ ప్రకటనల ద్వారా ఇతను మోసాలకు పాల్పడుతున్నాడు. ఆ పాప్-అప్‌ను క్లిక్ చేశారంటే ఇక అంతే సంగతి... మదురవోయల్‌కి చెందిన పి.ఉదయ్ రాజ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఉద్యోగ అన్వేషణలో ఉన్న తాను ఫిబ్రవరి 16న లొకాంటో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్టు పోలీసులకు చెప్పాడు. అందులో ఉద్యోగ ప్రకటనల కోసం సెర్చ్ చేస్తుండగా.. అతని సెల్‌ఫోన్ స్క్రీన్‌పై సెక్స్ చాట్‌ పేరుతో ఓ పాప్‌-అప్ వచ్చింది.

 

 

చదువుకున్న కొంత మంది గ్యాడ్యుయేట్లను టార్గెట్ చేస్తున్న వీళ్ళను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2017 నుంచి తాను ఈ రకమైన మోసాలకు పాల్పడుతున్నానని,ఇప్పటివరకు 350 మంది పురుషుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశానని చెప్పాడు. పోలీసులు అతనిపై సెక్షన్ 384,506ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే పిర్యాదు చేస్తే పరువు పోతుందని ఎవరు కేసు పెట్టలేదని పోలీసులు వెల్లడించారు. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: