రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా అనర్గళంగా చెప్పగలిగే నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీ నుండి గల్లీ దాకా అన్ని రాజకీయాలను తానే దగ్గరుండి చూసుకుంటూ వ్యవహరించేవారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం జరిగిందో అప్పటినుండి క్రియాశీలక రాజకీయాలకు ఉండవల్లి దూరంగా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన లేకపోతే దేశంలో ఏదైనా హైలెట్ విషయం గురించి చర్చలు గట్టిగా జరుగుతున్న సమయంలో తనదైన శైలిలో మీడియా ముందుకు వచ్చి సవివరంగా తన అభిప్రాయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుపుతారు. చంద్రబాబు హయాంలో చాలా సందర్భాలలో ఉండవల్లి అరుణ్ కుమార్ పరిపాలనలో తప్పిదాలు గురించి మీకు అదే విధంగా పోలవరం ప్రాజెక్టు గురించి బహిరంగంగా మీడియా ముందు విమర్శలు చేయడం జరిగింది.

 

ఇప్పుడు ఇదే విధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలన పై భారీ స్కెచ్ తరహాలో ఒకపక్క మీడియా ముందు మరోపక్క లెటర్ ద్వారా విమర్శలు మీద విమర్శలు చేస్తున్నారు. చాలా వరకు చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర తెలుగుదేశం పార్టీ కంటే ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్నట్లు ఉందని చాలామంది సీనియర్ రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. విషయంలోకి వెళితే జగన్ అధికారంలోకి వచ్చాక కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఇటీవల మీడియా ముందుకు వచ్చిన ఉండవల్లి అరుణ కుమార్ తనదైన శైలిలో ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఏడాది వేచి చూడాలనుకున్నా జగన్ ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకోవాలనే మాట్లాడాలిసివచ్చిందని ముక్కుసూటిగా చెప్పేశారు.

 

పెన్షన్ల విషయంలో  ఇంకా కొన్ని జగన్ తీసుకుంటున్న నిర్ణయాలలో మీడియా ముందు షాకింగ్ కామెంట్లు చేశారు. ఇదే సమయంలో విమర్శలు చేస్తూ ఉండవల్లి లెటర్ కూడా రాయడం జరిగింది. కాగా ఉండవల్లి చేసిన కామెంట్లను ప్రతిపక్ష పార్టీ టీడీపీకి బెనిఫిట్ కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైసీపీ నేతలు. గతంలో ఉండవల్లి టీడీపీపై విమర్శలు చేసిన సమయంలో వాటిని వైసిపి పార్టీ అస్త్రాలుగా ఉపయోగించుకొని పొలిటికల్ మైలేజ్ పొందేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ టీడీపీకి ఇవ్వకుండా వైసిపి చాలా తెలివిగా వ్యవహరించడంతో ఉండవల్లి వేసే విమర్శల స్కెచ్ బొక్క బోర్లా పడి నట్లయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: