అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రావడం ఏమో గాని నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు భారతీయులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన ఈ సందర్భంగా చాలా విషయాలను ప్రస్తావించారు. భారత అభివృద్ధి తో పాటుగా అనేక ఆసక్తికర విషయాలను ట్రంప్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్రికెట్, సినిమా, మతాలు, స్నేహం, వ్యాపారం, శక్తి సామర్ధ్యాలు ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఆయన ప్రస్తావించారు. ట్రంప్ ప్రసంగంలో చాలా హైలెట్స్ ఉన్నాయి కూడా. ముఖ్యంగా మోడిని అయన ఆకాశానికి ఎత్తేసారు. 

 

అంత వరకు అలా ఉంటే ఆయన ప్రసంగంలో కొన్ని తప్పులు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. కొన్ని పేర్లు ఆయనకు నోరు తిరగలేదు. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరుని ట్రంప్... సూచిన్ టెండూల్కర్ అని పలికారు. మోడీ గురించి ప్రస్తావించే సమయంలో చివాలా అన్నారు. వాస్తవానికి అది చాయ్ వాలా. ఇక ఆధ్యాత్మిక గురువు స్వామీ వివేకానంద పేరుని కూడా ఆయన తప్పు పలికారు. స్వామీ వివేకామనన్ అని చదివారు. దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే(డీడీఎల్‌జే), షోలే వంటి చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్నారు. 

 

ఈ క్రమంలో ఆయన షోలే ని షోజే అని పలికారు. వేదాలను ‘వేస్తాస్’ అని పలికారు ట్రంప్. అయితే ఆయన ప్రసంగ౦ మొత్తంలో ఎక్కడా కూడా పేపర్ చదవలేదు. దీనితో భారతీయులు ఫిదా అయిపోయారు. ప్రసంగం ఆసాంతం ఆయన ఆకట్టుకునే విధంగానే ప్రసంగించారు. భారత్ అమెరికా కలిసి ముందుకి వెళ్తాయని అన్నారు. ఒప్పందాల గురించి కూడా అదే విధంగా ప్రస్తావించారు. ఇక చరఖా పని తీరుని ట్రంప్ చాలా జాగ్రత్తగా అడిగి తెలుసుకోవడం విశేషం. ఆర్ధిక బలోపేతం గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కాని ఆయన అన్ని విషయాలను ప్రస్తావించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: