అమరావతి పరిరక్షణ ఉద్యమ సమితి నేతలు రెండవ దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు .  ఈసారి తమ ఉద్యమ కార్యాచరణ లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవాలని నిర్ణయించారు . కేసీఆర్ ను కలిసి తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని కోరనున్నట్లు తెలుస్తోంది . అయితే  తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కేసీఆర్ ప్రజాసంఘాలు , ఉద్యమకారులకు అపాయింట్ మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు .  అటువంటిది అమరావతి ప్రరిరక్షణ సమితి నేతలకు  ఆయన  అపాయింట్ మెంట్ ఇస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది .

 

ఒకవేళ కేసీఆర్ , అమరావతి ఉద్యమ పరిరక్షణ సమితి నేతలకు అపాయింట్ మెంట్ ఇస్తే .. అది మాత్రం  రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం కానుంది . ఎందుకంటే కేసీఆర్ , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి . ఇటీవల కేసీఆర్ ను కలిసిన సందర్బంగా జగన్ , తాను తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం గురించి వెల్లడించగా , కేసీఆర్ భేష్ అంటూ కితాబు ఇచ్చారన్న ప్రచారం జరిగింది . ఈ నేపధ్యం లో  అమరావతి ని రాజధానిగా కొనసాగించాలంటూ దాదాపు రెండు నెలలకు పైచిలుకు ఉద్యమాన్ని కొనసాగిస్తోన్న అమరావతి పరిరక్షణ ఉద్యమ సమితి నేతలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చి కలుసుకోవడం అంటే , గతం లో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి లేనట్టేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . 

 

ఒకవేళ అపాయింట్ మెంట్ ఇవ్వకుండా దాటవేస్తే జగన్ తో తనకున్న మైత్రికి ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని అంటున్నారు . ఏ విధంగా చూసిన అమరావతి పరిరక్షణ ఉద్యమ సమితి నేతలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చే అవకాశాలు కన్పించడం లేదు . కానీ వారు ప్రయత్నించడం మాత్రం రాజకీయంగా వారికి ఎంతో, కొంత మేలు చేసే అవకాశాలు లేకపోలేదు .   

మరింత సమాచారం తెలుసుకోండి: