అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనలో అనేక వింతలు విశేషాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం ఆయన విమానం దిగిన దగ్గర నుంచి ఆయనకు సంబంధించిన వార్తలు మీడియాలోనూ, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆయనకు భారత ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, ఆయన పర్యటన విశేషాలు, ఆయన ఇక్కడి ప్రజలతో నాయకులతో వ్యవహరించిన తీరు ఇలా అనేక అంశాల మీద తీవ్ర స్థాయిలో చర్చలు నడిచాయి. అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ తొలిసారిగా భారత్ కు  రావడంతో ఆ మేరకు ఘనంగా ఆయన కోసం ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కూడా భారత పర్యటనపై తనకు ఏ మేరకు ఆసక్తి ఉంది అనే విషయాన్ని తన ప్రసంగాల్లో కూడా మోదీ చెప్పారు.  


ఈ సందర్భంగా భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్ మాట్లాడారు. ఇక అతి కీలకమైనది మోతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ పేరిట నిర్వహించిన భారీ సభలో లక్షలాది మంది జనాలు హాజరయ్యారు.  అయితే ఈ సమావేశంలో ప్రసంగించిన ట్రంప్ అందరినీ తీవ్ర నిరాశకు గురి చేశారు. అంతేకాకుండా తన ప్రసంగంలో అనేక తప్పులు దొర్లడం, ఇంగ్లీష్ పదాలు పలికేందుకు  చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రసంగంలో కొన్ని తప్పులను పరిశీలిస్తే మోదీని అందరూ చాయ్ వాలా అంటూ పిలుస్తారు. మోదీ కూడా తాను తాను చాయ్ వాలా గా అని చెప్పుకుంటూ ఉంటారు. ఇదే విషయాన్ని సభలో ప్రస్తావించేందుకు ట్రంప్ చాలా ఇబ్బంది పడ్డారు. చాయ్ వాలాను కాస్తా 'చివాలా' అంటూ పలికారు. అంతటితో ఆగకుండా వివిధ రంగాల్లో ప్రముఖమైన వ్యక్తుల పేర్లను కూడా పలికేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. వారి పేర్లను తప్పుగా పలికారు.


 స్వామి వివేకానంద అని పలకడానికి  స్వామి వివేకానంద పేరుని పలకడానికి స్వామి వివేకమాన్ అని, ది వేదాస్' అనే పదాన్ని 'ది వెస్తాస్' అని సచిన్ టెండూల్కర్ ను  సూచిన్ టెండూల్కర్' అని విరాట్ కోహ్లీని విరూట్ కోహ్లీ అని, బాలీవుడ్ సినిమా షోలేని షోజే అని ఇలా రకరకాలుగా తప్పులుగా పలికారు.  సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ఇలా తప్పుల తడకగా తన ప్రసంగాన్ని కొనసాగించడంపై  సోషల్ మీడియాలో జోకులు పేలాయి. ఏంటి అమెరికా ప్రెసిడెంట్..?  నీకు ఇంగ్లీషు రాదా ..? నోరు తిరగడంలేదా అంటూ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు ఓ రేంజ్ లో పేలాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: