జనసేన పార్టీ ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి ఆ పార్టీని ఏదో రకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ప్రజా పోరాటాలు చేయడం, ఉద్యమాలు, ధర్నాలు అంటూ హడావుడి చేస్తున్నాడు. ఏదోరకంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. వచ్చే ఎన్నికలనాటికి ఏపీలో అధికారం దక్కించుకోవాలనే ఆలోచనతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మరింత దూకుడుగా పార్టీలోని నాయకులను యాక్టివ్ చేయాలని పవన్ వివిధ కమిటీలను నియమించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రాంతాల వారిగా మొత్తం ఐదు కమిటీలను నియమించారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీల పేరుతో మొత్తం ఐదు కమిటీలను పవన్ నియమించారు. ప్రస్తుతం నియమించిన కమిటీ లు బిజెపి స్థానిక కమిటీలను సమన్వయం చేసుకుంటూ రెండు పార్టీల కార్యక్రమాల నిర్వహణ, అధ్యక్షులు ఆదేశాలను జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లేందుకు వీటిని ఏర్పాటు చేశారు. 

 

ఉత్తరాంధ్ర కమిటీ

శ్రీకాకుళం, విజయనగరం, అరకు, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంట్ నియోజక వర్గాలకు ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్ గా సుందరపు విజయ్ కుమార్,( యలమంచిలి) జాయింట్ కన్వీనర్ గా ఘంటసాల అప్పారావు (గాజువాక) సభ్యులుగా పరుచూరి భాస్కరరావు (అనకాపల్లి) రామ్మోహన్ (ఆమదాలవలస) విశాఖపట్నం లను నియమించారు.

 

గోదావరి సంయుక్త కమిటీ

కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గాలకు గోదావరి సంయుక్త కమిటీన ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కన్వీనర్ గా మేడ గురుదత్త, (రాజమహేంద్రవరం) శెట్టిబత్తుల రాజబాబు, (అమలాపురం) జాయింట్ కన్వీనర్ గా సభ్యులుగా వేగుళ్ల లీలా కృష్ణ (మండపేట), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం),  యిర్రంకి సూర్యారావు (భీమవరం) నాగబాబు (పాలకొల్లు) ను నియమించారు.

 

సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీ

విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ స్థానాలకు ఆంధ్ర సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కన్వీనర్ గా  కళ్యాణం శివ శ్రీనివాస్ (గుంటూరు), జాజాయింట్ కన్వినర్ గా సయ్యద్ జిలానీ (నరసరావుపేట) - సభ్యులుగా పోతిన వెంకట మహేష్ (విజయవాడ) - అమ్మిశెట్టి వాసు (విజయవాడ) - గాదె వెంకటేశ్వరరావు (గుంటూరు) - పాకనాటి రమాదేవి (గుంటూరు) ఉంటారు.

 

రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీ

తిరుపతి, చిత్తూరు, రాజంపేట, నెల్లూరు, ఒంగోలు, పార్లమెంటరీ నియోజకవర్గాలకు రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కన్వీనర్ గా పసుపులేటి హరిప్రసాద్, షేక్ రియాజ్ జాయింట్ కన్వీనర్ గా, సభ్యులుగా యుగంధర్ (గంగాధర నెల్లూరు), సయ్యద్ ముకరం చాంద్ (రాజంపేట), యగవింటి (మైఫోర్స్) మహేష్ (మదనపల్లి), మాసి కృష్ణమూర్తి (తిరుపతి) , ఆరేటి కవిత (చిత్తూరు) , శ్రీ గానుగపెంట శ్రీకాంత్ (నెల్లూరు) ఉంటారు.


రాయలసీమ సంయుక్త కమిటీ 

అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల, కడప పార్లమెంట్ నియోజక వర్గాలకు రాయలసీమ సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కన్వీనర్గా టి.సి.వరుణ్ (అనంతపురం), సుంకర శ్రీనివాస్ (కడప) జాయింట్ కన్వీనర్ గా  సభ్యులుగా చింతా సురేష్ (కర్నూలు), రేఖ గౌడ్ (ఎమ్మిగనూరు), ఆకుల ఉమేష్ (హిందూపురం) , మలిశెట్టి వెంకటరమణ (కడప) ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: