జనసేన పార్టీలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి రేగుతూనే ఉండడం కాకుండా.. జనసేన కు సంబంధించిన ఏదో ఒక హాట్ టాపిక్ ఏపీ రాజకీయాల్లో చర్చకు వస్తూనే ఉంటుంది. ఇప్పటికే పవన్ ను బలంగా నమ్మిన వారు, పార్టీని పెట్టినప్పటి నుంచి అండగా ఉంటూ వస్తున్న వారు చాలామంది ప్రస్తుతం పవన్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. కొంతమంది వివిధ పార్టీల్లో చేరిపోగా మరికొంతమంది రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఒకవైపు పవన్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే దిశగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వివిధ కమిటీలను కూడా నియమించారు. ఎలాగూ కేంద్ర అధికార పార్టీ బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి బలమైన పార్టీగా జనసేన మారడంతో పాటు అధికారం చేజిక్కించుకుంటుందని పవన్ బలంగా నమ్ముతున్నారు.


 ఇంత వరకు బాగానే ఉన్నా మొన్నటి వరకు పవన్ ఎక్కడ సభ, సమావేశాలు పెట్టినా ఏ ప్రాంతంలో పర్యటించినా ఆయన పక్కనే ఉంటూ వచ్చిన నాదెండ్ల మనోహర్ కొద్దిరోజులుగా పవన్ పక్కన కనిపించడం లేదు. దీనిపై జనసేన పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కొంతకాలంగా పవన్ తీరుపై అసహనం తో ఉన్న నాదెండ్ల మనోహర్ పార్టీకి దూరం అవ్వాలని చూస్తున్నారని, మరికొద్ది రోజుల్లోనే ఆయన జనసేనకు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన వైసీపీ లోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్నా, నాదెండ్ల మనోహర్ మాత్రం స్పందించడం లేదు. 


అసలు జనసేనకు ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నారు అనే విషయం కూడా ఆయన క్లారిటీ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో జనసేనలో ఏదో అంతర్యుద్ధం జరుగుతోందని, నాదెండ్లకు పవన్ కు అస్సలు పొసగడంలేదు అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఏఈ విషయంలో అటు పవన్ కానీ, ఇటు నాదెండ్ల కానీ క్లారిటీ ఇచ్చేందుకు ఇష్టపడకపోవడం మరింతగా సందేహాలను కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: