వివాదాస్పద అయోధ్య భూభాగంలో రామమందిరం నిర్మించాలి అని హిందువులు లేదు బాబ్రీ మసీదు నిర్మించాలని ముస్లింలు...  ఈ రెండు మతాల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.ఇక ఈ వివాదం ఎన్నో దశాబ్దాల పాటు సుప్రీం కోర్టులో వాయిదాలు పడుతూ రాగ... గత సంవత్సరం సుప్రీంకోర్టు ఈ వివాదాస్పద స్థలం విషయంలో సంచలన తీర్పును వెలువరించింది. అయోధ్య స్థలం తమదేనంటూ ముస్లిం సంస్థల నిరూపించుకోక  పోవడంతో అయోధ్య స్థలం హిందువులకు కేటాయిస్తూ తీర్పును వెలువరించింది. అదేసమయంలో ముస్లింలకు బాబ్రీ మసీదు నిర్మాణం కోసం ఐదు లోని ఐదు ఎకరాలు కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం వారికి భూమిని ఇవ్వాలి అంటూ సూచించింది.. అయితే మొదట సుప్రీంకోర్టు సూచించినప్పటికీ తమకు భూమి అవసరం లేదంటూ సున్నీ వక్ఫ్ బోర్డు తిరస్కరించిన విషయం తెలిసిందే. 

 

 

 అయితే తాజాగా అయోధ్య జిల్లాలో మసీదు నిర్మాణం కోసం తమకు సుప్రీంకోర్టు కేటాయించిన ఐదు ఎకరాల స్థలాన్ని తీసుకోవడానికి సున్ని సెంట్రల్ బోర్డ్ సోమవారం అంగీకరించినట్లు పేర్కొంది. అయితే ఈ స్థలంలో బాబ్రీ మసీదు నిర్మాణం తో పాటుగా ఇండో ఇస్లామిక్ పరిశోధన సంస్థ ఆసుపత్రి గ్రంథాలయాన్ని నిర్మిస్తామని అంటూ సున్నీ వక్ఫ్ బోర్డు తెలిపింది. ఈ మేరకు త్వరలో బాబ్రీ  మసీదు నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. సున్నీ వక్ఫ్ బోర్డ్ కి అయోధ్య నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నో హైవే సమీపంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఐదెకరాల స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. 

 

 

 

 సుని వర్క్స్ బోర్డు సభ్యులతో చర్చించిన అనంతరం తాము ఐదు ఎకరాల స్థలాన్ని స్వీకరించేందుకు నిర్ణయించాము అంటూ సుని వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫరూఖీ  తెలిపారు. ఈ క్రమంలోనే త్వరలో మసీదు ఏర్పాటు కోసం ట్రస్ట్  ఏర్పాటు చేస్తామనీ...  బోర్డుతో ఆ విషయాలకు  ఎటువంటి సంబంధం ఉండదు అంటూ తెలిపారు. అయితే ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిలో మసీదు లైబ్రరీ పరిశోధన సంస్థ ఏర్పాటు చేయడంతోపాటు భూమిని అన్ని రకాలుగా వినియోగించుకుంటామని  తెలిపారు  స్థానికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎంత విస్తీర్ణంలో మసీదు నిర్మించాలి అనే దానిపై... త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే ఇప్పటికే రామమందిర నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభలో ప్రకటన కూడా చేశారు. వివాదాస్పద స్థలం సహా 67,703 ఎకరాలను కూడా ట్రస్టుకు బదిలీ చేస్తుందని నరేంద్రమోడీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: