ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికలలో గెలిచిన చంద్రబాబు ప్రభుత్వం పై ఐదు సంవత్సరాలు పరిపాలన పై ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం “సిట్‌” అనే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు హయాంలో ఎవరైతే మంత్రులుగా పని చేశారో వాళ్లందరికీ ప్రస్తుతం “సిట్‌” భయం పట్టుకున్నట్లు టిడిపి వర్గాల్లో మరియు ఏపీ మీడియాలో బలమైన వార్తలు వినపడుతున్నాయి. ఇదే సమయంలో జగన్ సర్కార్ గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి అవినీతి బయటకు తీయాలి అంటూ “సిట్‌” ప్రత్యేక బృందం లో నియమించిన పదిమంది అధికారులకు చాలా గట్టిగా సూచించినట్లు సమాచారం.

 

టెండర్ విషయములో మరియు అదే విధంగా కాంట్రాక్టుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా అవినీతి చేసింది అనేది..ప్రతీది ఆధారాలతో సహా బయట పెట్టాలని జగన్ “సిట్‌” అధికారులకు తెలియజేశారు. అంతేకాకుండా ప్రభుత్వ నిర్ణయాల లో కానీ అమలు చేసే విధానంలో సంతకాలు పెట్టిన ప్రభుత్వ అధికారుల పని తీరుపై కూడా విచారణ చేయాలని నిబంధనల ప్రకారం కాకుండా పని చేస్తే ఏ మాత్రం విడిచి పెట్టకూడదని జగన్ “సిట్‌” బృందానికి తెలియజేసినట్లు వార్తలు రావడంతో చంద్రబాబు హయాంలో పని చేసిన అధికారులు ఇప్పుడు వణుకుతున్నారు.

 

ఈ నేపథ్యంలో ఇటీవల బయటపడిన ఈఎస్‌ఐ కుంభకోణం విషయంలో ముందుగా 'సిట్' ప్రత్యేక దర్యాప్తు బృందం అప్పట్లో మంత్రిగా ఉన్న అచ్చెన్న కన్నా ముందుగా సంబంధిత అధికారులను ప్రశ్నించడానికి రెడీ అవుతున్నట్లు ప్రస్తుత ప్రభుత్వ వర్గాలలో టాక్. ముఖ్యంగా ఈఎస్ఐ కుంభకోణంలో ఆధారాలతో సహా  అన్ని విషయాలు బయటకు రావడంతో ఆ శాఖకు సంబంధించిన అధికారులు “సిట్‌” దర్యాప్తు బృందం ఎప్పుడు రమ్మని పిలుస్తారో అన్న భయాందోళన లో ఉన్నట్లు సమాచారం. దీంతో జగన్ SIT దెబ్బకి చంద్రబాబు తో పాటు ఆయన హయాంలో పని చేసిన అధికారులు కూడా వణుకుతున్నట్లు ఆంధ్ర రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: