ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విశాఖలో పలాస-1978 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న కామారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిస్థితులపై అలాగే రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. ఆంధ్ర రాష్ట్రానికి మూడు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కానీ పరిపాలన ఎక్కడినుంచి జరిగితే అదే రాజధాని అవుతుందని దానికి కొత్త కొత్త పేర్లు పెట్టుకున్నంత మాత్రాన అన్ని రాజధానులు కావని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించి ఏడు వేల కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఇంకా రెండు వేల కోట్లు ఖర్చు చేస్తే అమరావతి పూర్తి రాజధాని నిర్మాణం కంప్లీట్ అయ్యేదని అన్నారు.

 

రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారుస్తూ పోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు అని అదేవిధంగా పెట్టుబడులు కూడా రావు అంటూ సీరియస్ అయ్యారు. ఈ విధంగా ఎవరికి వారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఇష్టానుసారం అయిన నిర్ణయాలు తీసుకుంటే ఎవ్వరూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు అదేవిధంగా ఉద్యోగాలు కూడా రావు అని విమర్శలు చేశారు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ గత ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తే తమపై కేసులు పెట్టి అరెస్టు చేసిందని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండటంతో వాళ్లే ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తున్నారని అన్నారు.

 

ఇదే తరుణంలో రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు బూతులు తిట్టు కోటానికే సభా సమయాన్ని వృధా చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలపై చర్చించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అంటూ విమర్శలు చేశారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థ వల్ల తెలుగు వాళ్ళమని బయట ప్రపంచానికి చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందని తమ్మారెడ్డి భరద్వాజ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: