ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి తిరుమల దేవస్థానం. ఆ పుణ్యక్షేత్రం నిర్వహణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వతంత్ర కమిటీ చేస్తూ ఉంటుంది. ఆ కమిటీ లేనప్పుడు అధికారులు నిర్వహణలు చూసుకుంటూ ఉంటారు. అయితే తిరుమల పుణ్యక్షేత్రానికి ఎన్నో కోట్లమంది భక్తులు వస్తుంటారు కనుక కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అవి సరిచేస్తూ ఉండాలి.. అక్కడికి వచ్చిన అందరికి అన్ని సదుపాయాలు అందించేందుకే భక్తులు విరాళాలు ఇస్తుంటారు.. అక్కడ ఉండిలో డబ్బులు వేస్తుంటారు. 

 

రాష్ట్ర ప్రభుత్వం సమానం అయినటువంటి శాఖలు అందులో ఉన్నాయి. అన్ని వ్యవస్థలు ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని సంఘటనలు అక్కడ కలకలం రేపుతున్నటువంటి రెండు ఆత్మహత్యలకు సంబంధించి చర్చ. ఇది గతంలో వైసీపీ తరపునే ఉండే నవీన్ అనే వ్యక్తి పోస్ట్ చేసిన అటువంటి పాయింట్ చూస్తే అది ఖచ్చితంగా చర్చించాల్సిన విషయం. 

 

తిరుమలలోని టీటీడీ చైర్మన్ కార్యాలయంలో సూపెర్టెండెంట్ గా చేరి నెల తిరగకముందే అధర్మంగా తిరుపతికి బదిలీ అయినా ఉమా శంకర్ రెడ్డి ఆత్మహత్యకు గురవ్వడం దురదృష్టకరం. గతంలో తిరుమల జేఈఓ ఆఫీస్ లో పని చేసినటువంటి మిత్రులు సురేష్ ఆత్మహత్య.. ఈరోజు ఉమా శంకర్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటి? బాధ్యులు ఎవరు? మొత్తం మూడు ఆత్మహత్యలు. 

 

టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి ఆఫీస్ నుంచి ఉమా శంకర్ రెడ్డి ఎందుకు ఉన్న ఫలంగా బదిలీ కబడ్డారు? టీటీడీ చైర్మన్ ఆఫీస్ నుండి ఉమా శంకర్ రెడ్డిని బదిలీ చేసి అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టింది ఎవరు ? నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ వెళ్లే ఉమా శంకర్ రెడ్డి ఆత్మహత్యపై టీటీడీ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలి.. ఎంతటి ఉన్నతాధికారైనా శిక్షించాలి. 

 

అలాగే టీటీడీ ఉద్యోగస్థులారా దయచేసి దైర్యంగా ఉండండి.. మనో దైర్యం కోల్పోమకండి.. టీటీడీలో ఉన్నతాధికారుల వేధింపులను, తప్పులను శ్రీవారి సేవకులుగా ఐకమత్యంతో ఇప్పటికైనా నిలదియ్యండి. బహిరంగంగా ప్రశ్నించండి. గతంలో సురేష్, నేడు ఉమాశంకర్ రెడ్డిలా రేపు మరొకరి ఆత్మహత్యలు జరగకుండా చూసుకోండి. అంటూ నవీన్ ఓ పోస్ట్ పెట్టాడు. అయితే ఇక్కడ ఆ రెండు ఆత్మహత్యల గురించి ప్రధాన ప్రశ్నలు వేశారు. 

 

అయితే ఇక్కడ ఆ లోపాలు ఏంటి అనేది ఎవరు పట్టించుకోవడం లేదు.. ఆత్మహత్య సందర్భంలో ఏదైనా పొలిటికల్ రైవల్రి వచ్చినప్పుడు దాని గురించి మీడియా అంత  డిబేట్లు పెడుతుంది. సేమ్ టైమ్ అక్కడ ఎం జరుగుతుంది అనేది చర్చకు వాస్తు ఉంటుంది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు అనారోగ్యంతోనో.. ఆర్ధిక ఇబ్బందులతోనో ఆత్మహత్యలు చేసుకోలేదు. 

 

అక్కడ ఒకరకమైనటువంటి యాక్షన్ ఫేస్ చేశారు. ఆ యాక్షన్ తర్వాత వారు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఆ యాక్షన్ ఎందుకు వారి మీద తీసుకున్నారు? దానికి కారణాలు ఏంటి? అది నిజామా? కదా? ఒకొక్కసారి నిజాయితీగా ఉన్న వారిపై ఏమైనా శిక్షలు వేస్తే వాళ్ళు తట్టుకోలేరు.. అలానే ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. అది హ్యూమన్ సైకాలజీ. 

 

ఆలా ఏమైనా తప్పుడుగా వాళ్ళ మీద ఏమైనా చేసి ఉంటె దాన్ని సరిదిద్దాలి.. లేకపోతే భవిష్యేత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం  కాకుండా వాళ్లందరితో కౌన్సిలింగు.. వాళ్ళతో నెలకో, వారానికో ఒకసారి కూర్చొని వాళ్ళ వాళ్ళ బాధలు వింటూ దానికొక పరిష్కారం చూడకపోతే గనుక ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ వీఐపీస్ విజిట్స్ మూలంగా.. ఆ వత్తిడి వాళ్ళ మీద ఎంత ఉంటుందో.. వాళ్ళకంటే వెయ్యిరెట్లు ఇలాంటి చోట్లా పని చేసే వారిపై ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక పరిష్కారం తీసుకుంటే బాగుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: