మద్యం తాగేవారికి శుభవార్త. త్వరలో మద్యం మరింత తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి రానుంది. వేసవికాలంలో విస్కీ, బీర్ ధరలు భారీగా తగ్గబోతున్నాయి. భారత ప్రభుత్వం మాల్ట్ బార్లీపై నిబంధనలు సవరించడంతో దేశంలో బీర్, విస్కీ ధరలు తగ్గనున్నాయి. బీర్, విస్కీ తయారీలో ప్రధానంగా మాల్ట్ బార్లీని వినియోగిస్తారు. ఒక లీటర్ బీర్ తయారు కావాలంటే అందులో 200 గ్రాముల మాల్ట్ బార్లీని ఉపయోగిస్తారు. 
 
బీర్ తయారీలో వినియోగించే ప్రధాన పదార్థమైన మాల్ట్ బార్లీని మన దేశం ఆస్ట్రేలియా నుండి దిగుమతి చేసుకుంటుంది. భారత ప్రభుత్వం 2019 డిసెంబర్ నెలలో మాల్ట్ బార్లీ నిబంధనలను మరింత సరళతరం చేస్తున్నట్టు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కు చెప్పింది. భారత ప్రభుత్వం ఫాస్పైన్ పుమిగేషన్ తో కూడిన బార్లీ దిగుమతికి అంగీకారం తెలిపింది. గతంలో భారత్ మిథైల్ బ్రోమైడ్ ఆధారిత ఫుమిగేషన్ తో తయారైన మద్యానికి మాత్రమే అనుమతి ఇచ్చేది. 
 
ప్రస్తుతం భారత్ ఈ నిబంధనలను సవరించింది. మన దేశంలో మాల్ట్ బార్లీకి భారీగా డిమాండ్ ఉంది. కానీ డిమాండ్ కు సరిపడా సప్లై లేకపోవడంతో ఆస్ట్రేలియా నుండి భారత్ మాల్ట్ బార్లీని దిగుమతి చేసుకుంటోంది. ప్రభుత్వం బార్లీ నిబంధనలను మార్చటంతో బేవరేజ్ పరిశ్రమలకు ఊరట లభిస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆస్ట్రేలియా నుండి అదనంగా బార్లీ దిగుమతి కానుంది. 
 
అందువలన బీర్, విస్కీ ధరలు భారీగా తగ్గనున్నాయని సమాచారం. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో పండించే మాల్ట్ బార్లీ ధర చాలా తక్కువని చెప్పారు. ఆస్ట్రేలియా నుండి ఏడాదికి దాదాపు 10 లక్షల టన్నుల బార్లీ దిగుమతిని టార్గెట్ గా పెట్టుకున్నామని చెప్పారు. ఏప్రిల్ నెల నుండి ప్రభుత్వం ఫాస్పైన్ పుమిగేషన్ తో కూడిన బార్లీని ఆస్ట్రేలియా నుండి దిగుమతి చేసుకోనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: