ఏపీ సీఎం జగన్ మంత్రులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. మంత్రులకు పని చేసి ప్రజల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని లేకపోతే మంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉందని సున్నితంగా హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను జగన్ ఇప్పటికే ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించారు. జగన్ ఇన్‌చార్జి మంత్రులకు వారికి కేటాయించిన జిల్లాలలో తప్పనిసరిగా మెజారిటీ సాధించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. 
 
ఇన్‌చార్జి మంత్రులే అభ్యర్థుల ఎంపిక నుండి ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్ ఇతరత్రా వ్యవహారాలన్నీ చూసుకోవాలని సీఎం సూచించారు. ఎమ్మెల్యేల మధ్య, కార్యకర్తల మధ్య విబేధాలు ఉన్నా పరిష్కరించాలని స్థానిక నేతలను, ఎమ్మెల్యేలను సమన్వయపరచి ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు ముగిసేవరకూ శాఖల విషయాలు పక్కన పెట్టాలని జగన్ మంత్రులకు సూచనలు చేశారు. 
 
లోకల్ మంత్రులు వారి సొంత జిల్లాలకే పరిమితమై స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని సీఎం సూచించారు. వైసీపీ పార్టీ వర్గాల్లో ఇన్‌చార్జి మంత్రులు కేటాయించిన జిల్లాల్లో మెజారిటీ దక్కించుకోవాలని లేకపోతే  పదవులు కోల్పోయే అవకాశం ఉందని జగన్ హెచ్చరించారని ప్రచారం జరుగుతోంది. ఇన్‌చార్జి మంత్రులు ఇప్పటికే లక్ష్యాలను అందుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. 
 
ఇన్‌చార్జి మంత్రులు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించటానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలలో మెజారిటీ నిర్ణయాలపై ప్రజల నుండి హర్షం వ్యక్తం కాగా కొన్ని నిర్ణయాలపై మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన ప్రభుత్వంపై వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో ఇన్‌చార్జి మంత్రులు ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాల్సి ఉంది.            

మరింత సమాచారం తెలుసుకోండి: