ఈ సృష్టిలో శృంగారం అనేది చాలా సహజమైన పక్రియ.. పూర్వకాలంలో చూసుకుంటే కొన్ని కొన్ని ఆలయాల్లో ఇప్పటికి శృంగార భంగిమల్లో ఉన్న శిల్పాలు కనిపిస్తాయి.. అయితే దీనిని లోకంలో బూతు పదంగా మార్చారు.. ఎలాగంటే, సమాజంలో న్యాయబద్దంగా, పంచభూతాల సాక్షిగా స్త్రీ, పురుషులు ఇద్దరు పెళ్లి అనే పేరుతో ఒకటిగా మారి, తమలోని కోరికలు విచ్చలవిడిగా విజృంభించకుండా జంటగా కలిసి తీర్చుకునేందుకు ఏర్పరచిన రక్షణ చర్యలో భాగమే ఈ పెళ్లి, శృంగారం... కాని నేటి కాలంలో ఒక్కరికే అంకితం కావలసిన ఇలాంటి జీవితాన్ని పదిమందితో పంచుకుని బజారుపాలు చేస్తున్నారు.. దీనివల్ల పవిత్ర కార్యం కాస్త అపవిత్రంగా మారిపోయి, బజారులో నగ్నంగా నిలబడింది..

 

 

ఇకపోతే ఈ మధ్యకాలంలో చాలమంది జంటలు సరైని విధంగా తమ శృంగార జీవితాన్ని ఆనందించలేకపోతున్నారు. ఫలితంగా అక్రమ సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి.. అందుకే కొందరు జంటలు వారి లైంగిక జీవితాన్ని ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు.. అందులోనిదే ఈ మెయింటనెన్స్ సెక్స్.. ఇందులో తమ పార్టనర్స్ లో ఒక్కరికి ఇష్టం లేకపోయినా మరొకరి కోసం పడకగది సుఖాన్ని అందివ్వడాన్నే మెయింటనెన్స్ సెక్స్ అంటున్నారు.

 

 

ఇక షెడ్యూల్డ్ సెక్స్ అంటే.. ఒకరికి ఈ రోజు మూడ్ ఉంటే మరొకరికి ఉండదు. ఇలా రోజుల గడిచిపోతే ఎలా? అందుకే వారానికి ఇన్ని రోజులు అని ప్లాన్ వేసుకుంటారు.. అంటే వారానికి రెండుసార్లు. ఆరోజు ఒకరికి మూడ్ ఉన్నా లేకున్నా, లేదా ఇష్టం లేకపోయినా పార్టనర్ తో కలవాల్సిందే. ఇంకో అప్షన్ లేదు. అలాగని ఇష్టంలేకపోయినా పార్టనర్ కోసం మనసును చంపుకోవడం మాత్రంకాదు. రెగ్యులర్ లైఫ్ నుంచి రొమాన్స్ మిస్ కాకుండా ఇద్దరూ చూసుకోవడమే ఈ టెక్నిక్..

 

 

సో ఇలా జీవితాన్ని ఆనందంగా గడపవలసిన జంటలు అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటు, నూరేళ్ల వైవాహిక జీవితాన్ని నవ్వులపాలు చేసుకుంటున్నారు.. వారి భవిష్యత్తును, కన్నవారి పరువును అంగట్లో తాకట్టు పెడుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: