ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకడుగు వేయడం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తుండటంతో .. ప్రజలకు సీఎం జగన్ అంటే ఒక ధీమా  సీఎం జగన్ అంటే ఒక భరోసా లాగా మారిపోయింది. మాకు ఏ సమస్య వచ్చినా సీఎం జగన్ అన్న ఉన్నాడు అనే ధీమా తో  ఉన్నారు ఆంధ్ర ప్రజలు. ఈ క్రమంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీలను ఆచరణలో పెట్టి ప్రస్తుతం ప్రజలకు అందేలా చేస్తున్నారు. ముఖ్యంగా పేదలకు మెరుగైన విద్య వైద్యం అందేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక రాష్ట్రంలోని పేద ప్రజలు అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు నడుంబిగించింది జగన్ సర్కార్. 

 

 

 ఈ క్రమంలోని ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కూడా చేపట్టింది... అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులు రెండు విభాగాలుగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకటి  బియ్యం కార్డు ఒకటి హెల్త్ కార్డు. అయితే బియ్యం కార్డు హెల్త్ కార్డు లతోపాటు ఆరోగ్యశ్రీ కార్డు లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది జగన్ సర్కారు. అంతేకాకుండా 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కార్డు అందిస్తామని గతంలో సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లబ్ధిదారుల పేర్లలో  మీరు ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుని చూసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: