ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను భయపడుతున్న విషయం తెలిసిందే. చైనా దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందిన ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ఎంతో మంది మృత్యువుతో పోరాడిలా చేస్తుంది ఈ ప్రాణాంతకమైన వైరస్.. అయితే ఇది ప్రపంచ దేశాల్లోని పలు దేశాలకు కూడా ఇప్పటికే వ్యాప్తిచెందింది. ఇటు భారత్లో కూడా... ఇప్పటికే పలు కరోనా  కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇకపోతే భారత్లో కరోనా ఎఫెక్ట్ తో ఎన్నో పుకార్లు జోరందుకున్నాయి నేపథ్యంలోనే చికెన్ తినకూడదు అని  ప్రచారాలు జరుగుతున్నాయి అయితే దీనిపై స్పందించిన అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అధికారులు క్లారిటీ ఇవ్వడంతో మాంసం ప్రియులందరూ చికెన్ తినేందుకు రెడీ అవుతున్న సమయంలో... మరో చిక్కు వచ్చి పడింది. 

 

 అంతుచిక్కని వైరస్ సోకి కోళ్లు భారీ మొత్తంలో చని పోతూ ఉండడంతో ప్రజలు మరోసారి చికెన్కు దూరంగానే ఉన్నారు. కోళ్లకు సోకింది ఏ వైరస్  ఏమో  అని భయంతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణా జిల్లాల్లో... ఈ కోళ్ళ మృతి ఎక్కువగా కనిపిస్తుంది. అంతుచిక్కని వైరస్ సోకిన కారణంగా ఇప్పటికే 30 వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. దీంతో పౌల్టీ నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు అధికారులు కూడా అయోమయంలో పడ్డారు. ఇక భారీ మొత్తంలో కోళ్లు చనిపోతుండటంతో  పాటు ప్రజలు కూడా కోళ్ళకి ఏం వైరస్ సోకిన చికెన్కు దూరంగానే ఉంటున్నారు. 

 

 

 ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో ఇప్పటికే 30 వేల ఫారం కోళ్లు మృతిపై తెలంగాణ పశు సంవర్ధక శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి మే నెల వరకు ఎండలు  పెరుగుతూ ఉండడం వల్ల... వీరులెంట్  న్యూకాజిల్ డిసీస్ ..వచ్చిందని  అధికారులు ప్రకటించారు. టీకాలు వేయడం ద్వారా ఈ వ్యాధిని నయం చేయవచ్చు అంటూ అధికారులు తెలిపారు. నూజివీడు నుంచి పెనుబల్లికి  కోడి పిల్లలను తీసుకు వచ్చారని అక్కడి నుంచి విఎండి  వైరస్ వచ్చింది అంటూ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: