మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా తయారవుతోంది చంద్రబాబునాయుడు పరిస్ధితి. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత దెబ్బ మీద దెబ్బ పడుతున్న చంద్రబాబుపై తాజాగా సుప్రింకోర్టులో కేసు దాఖలైంది.  కేసు కూడా అదీ ఇదని కాదు. ఏకంగా నిబంధనలను తొక్కిపెట్టి రాజధాని ఏర్పాటులో అవకతవకలకు పాల్పడ్డాడంటూ కేసు వేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపి అధ్యక్షుడు బోరుగడ్డ అనీల్ కుమార్ వేసిన కేసును  సుప్రింకోర్టు అడ్మిట్ చేసుకుంది.

 

సరే కోర్టుల్లో కేసులంటే మన బాబుగారికి ఇప్పటికిప్పుడు వచ్చే ఉపధ్రవం ఏమీ లేదనుకోండి అది వేరే విషయం. కాకపోతే పిటీషన్ ను మొదట్లోనే డిస్మిస్ చేసేయాల్సుండగా విచారణకు అడ్మిట్ చేసుకోవటం ఏమిటన్నది ఎవరికీ అర్ధం కావటం లేదు. గతంలో కూడా చంద్రబాబుపై ఎన్ని కేసులు కోర్టుల్లో పడలేదు ? ఎన్ని వీగిపోలేదు ? కాబట్టి కోర్టుల్లో కేసంటే చంద్రబాబు భయపడతారా ?

 

కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబుకు అసలే బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. కాబట్టి బ్యాడ్ టైంలో తాడు కూడా పామై కరిచే ప్రమాదం ఉంది.  పైగా వేసిన కేసు కూడా రాజధాని విషయంలో. రాజధానిగా అమరావతిని ఎంపిక చేయటంలో చంద్రబాబు నిబంధనలను అన్నింటినీ తుంగలో తొక్కేశారని, విభజన చట్టాలను, శివరామకృష్ణన్ కమిటి నివేదికకు పూర్తిగా విరుద్ధంగా నడుచుకున్నారన్నది కేసులోని సారంశం.

 

 తన పిటీషన్లోనే చంద్రబాబు ఉల్లంఘనలన్నింటినీ ప్రస్తావించాడట. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో భారీ నిర్మాణాలు చేయకూడంటూ నేషనల్ గ్రీన్  ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను, చంద్రబాబు దాన్ని ఉల్లంఘించిన విధానంపై ఫిర్యాదు చేశారట. అలాగే రాజధాని ఎంపిక విషయంలో  శివరామకృష్ణన్ కమిటి చెప్పిందేమిటి ?  చంద్రబాబు చేసిందేమిటి ? అన్న అంశం మీద కూడా పూర్తి వివరాలతో సాక్ష్యాలను కూడా అందించారట. పిటీషనర్ వాదనను, అందించిన వివరాలు, సాక్ష్యాధారాలను చూసిన తర్వాతే సుప్రింకోర్టు కేసును అడ్మిట్ చేసుకున్నదట. పిటీషన్ ను స్వీకరించిందంటే చంద్రబాబుకు కూడా నోటీసులు ఇస్తుంది. మరి అపుడు చంద్రబాబు ఏమంటారో చూద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: