ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.. ఇందులో భాగంగా ఏపీ సీయం జగన్ మంత్రులకు నిదుర లేకుండా చేస్తున్నాడట.. తమ విధులను న్యాయబద్ధంగా నిర్వహించి ప్రజల్లో మార్కులు సంపాదించాలి.. అంతే కాని మంత్రి పదవి రాగానే ఏసీ రూముల్లో కూర్చొని ప్రజలతో నాకేం పని అని అనుకుంటూ ఎంజాయ్‌ చేస్తామంటే కుదరదు.. అని చెప్పిన జగన్ మాటలకు మంత్రులు ఈ అధినేత దగ్గర మార్కులు తెచ్చుకోవాలని, ఈ రెండింటిలో ఏ మాత్రం తేడా వచ్చినా పదవి హుష్‌ కాకి అనే భయంతో ఉన్నారట..

 

 

ఇదివరకే రాజకీయాల్లో యూనిట్‌ టెస్టులు రాసి, ఇప్పుడు వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్నారట ఈ ఏపీ మంత్రులు... ఈ క్రమంలో తాజాగా జగన్ తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు మంత్రులను మాత్రం టెన్షన్‌ పెడుతున్నాయట..  ఇకపోతే ఇదివరకే సాధారణ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన వైసీపీ.. ఇప్పుడు స్థానిక సమరంలోనూ అంతకు మించి మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో ఉన్న నేపధ్యంలో. ఈ ఎన్నికల్లో గెలవాల, ఓడాల అనే నిర్ణయాన్ని, దాని ఫలితాన్ని అనుభవించే బాధ్యలను పూర్తిగా మంత్రులకు అప్పగించారట సీఎం జగన్‌. ముఖ్యంగా జిల్లాల్లో మెజారిటీ తప్పనిసరిగా సాధించాల్సిందేనంటూ ఇన్‌చార్జి మంత్రులను ఆదేశించారని అంటున్నారు.

 

 

ఇదే కాకుండా కేవలం బాధ్యతలు అప్పగించి కూర్చోలేదట. ఓ అగ్నిపరీక్ష కూడా పెట్టారట జగన్. స్థానిక సమరంలో మెజారిటీ దక్కించుకోలేకపోతే వారి పోస్ట్‌లకు ఊస్టింగ్‌ తప్పదనే వార్నింగ్ కూడా ఇచ్చారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో లోకల్ వార్ అంటేనే మంత్రులు హడలిపోతున్నారట... ఈ దశలో ఏపీలో నెలకొన్న కొన్ని పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారట.. మరి ప్రజల నుండి ఓట్లు ఎంతవరకు రాబట్టి సక్సెస్ సాధిస్తారో, వారి ప్రయత్నాలు ఎంత వరకూ వర్కవుట్ అవుతాయో ఈ పరిస్థితులన్నింటి నుంచి మంత్రులు ఎలా గట్టెక్కుతారోనని ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారట... 

మరింత సమాచారం తెలుసుకోండి: