ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్న విషయం తెలుసిందే. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. అయితే ద్విచక్రవాహనంపై వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవడమే కాదు... ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు బైక్పై కూర్చున్నప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళను వేసుకునే చున్నీలు  కానీ చీరలు కానీ బైక్ చక్రంలో పోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వాటిని సరిగ్గా సర్దుకోవాలి. అయితే మహిళ దుస్తువులు ద్విచక్ర వాహన చక్రంలో పడి ఇప్పటికే ఎన్నో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. ఇక్కడ ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్తుండగా అంతలోనే విషాదం నెలకొంది. 

 

 

 ద్విచక్ర వాహన చక్రంలో ఓ మహిళ చీర చిక్కుకొని ఏకంగా ఆమె ప్రాణాలు పోయేలా చేసింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కు చెందిన పిట్టల సైదులు ముదిరాజ్ కొన్నేళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. సొంత ఊళ్లో పని నిమిత్తం సైదులు అతని భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై సొంత ఊరికి బయలుదేరతాడు. ఇక బైక్ పై కూర్చున్న సైదులు భార్య చీర ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం చక్రం లో పడింది. దీంతో ప్రమాదం జరిగి పోయింది. 

 

 

 యాదాద్రి జిల్లా ఆత్మకూరు జేఎఎస్  ఫంక్షన్ హాలు వద్దకు రాగానే సదరు మహిళ చీరకొంగు ద్విచక్ర వాహనం చక్రం లో ఇరుక్కొని ఒక్కసారిగా... సదరు మహిళ కిందపడిపోయింది. ఈ సమయంలోనే ఆ మహిళకు తలకు బలంగా గాయమైంది. ఇక వెంటనే బైక్ ఆపిన సైదులు ముదిరాజ్ భార్య పరిస్థితి చూసి వెంటనే ఆంబులెన్స్ కి కాల్ చేసాడు. కానీ అందుబాటులో లేకపోవడంతో పోలీస్ పెట్రోలింగ్ వాహనం స్పందించింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ మహిళను హుటాహుటిన పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటించాలి అని పోలీసులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: