అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సహా భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నిన్న అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో భారత్ లో అడుగు పెట్టిన డోనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి అనంతరం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మోతేర  స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నమస్తే ఇండియా అంటూ ప్రసంగం చేసి అక్కడికి చేరుకున్న ప్రజలందరిని ఆకర్షించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక నమస్తే ట్రంప్  కార్యక్రమంలో ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు వివిధ కీలక విషయాలపై కూడా ప్రసంగం చేశారు. ఇక నమస్తే ట్రంపు కార్యక్రమం అనంతరం భారత్ కు  వన్నెతెచ్చిన తాజ్ మహల్ ను సందర్శించారు ట్రంప్  కుటుంబ సభ్యులు. అనంతరం ఢిల్లీలో బస చేసేందుకు వెళ్లారు. 

 

 

 అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రంప్  పర్యటన పై స్పందించిన సిపిఐ నారాయణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను  ప్రపంచ ఉగ్రవాదిగా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన వెనుక అసలు కారణం.. అమెరికాలోని ప్రవాస భారతీయుల ఓట్ల కోసమే అంటూ ఆయన ఆరోపించారు. మంచిర్యాల లో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర స్థాయి నిర్మాణ సదస్సులో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ... ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

 

 నేడు డోనాల్డ్ ట్రంప్ పర్యటనను  అడ్డుకుంటామని... దేశవ్యాప్తంగా సిపిఐ నిరసనలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అమెరికాలోని భారతీయులను హింసిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలకడం దారుణమన్నారు. భారత్కు ఎంతో మేలు చేస్తున్న ఇరాన్ లాంటి దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాడులు చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించిన సిపిఐ నారాయణ... మెక్సికో సరిహద్దుల్లో ట్రంపు గోడ కడుతున్నట్లు..మోదీ  అహ్మదాబాద్లో కట్టారు అంటూ ఎద్దేవా చేశారు. ట్రంపు గౌరవార్థం రాష్ట్రపతి నేడు ఇచ్చే విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావద్దు అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: