పోలీసులు నేరాలను అరికట్టేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. చిన్న అనుమానం వచ్చిన క్షున్నంగా  తనిఖీ చేస్తూ నేరాలను అరికట్టే పనిలో నిమగ్నమై పోతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు పోలీసులకు కూడా షాకులు తగులుతున్నాయి. కొన్ని కొన్ని సార్లు సాధారణ ప్రజలను కూడా అనుమానించాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఓ వ్యక్తిపై గత కొన్ని రోజుల క్రితం కత్తులతో దాడి చేశారు. తీవ్రగాయాల పాలైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి బంధువులు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించి ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలోనే తీసిన ఫోటోలు బయటకు వచ్చాయి.

 

 

 అయితే ఇక్కడే పోలీసులకు అనుమానం వచ్చింది... ఆ వ్యక్తికి సంబంధించి తీసిన ఫోటోలలో తుపాకీ కనిపించింది . ఇక విచారణ చేసేందుకు అక్కడికి వెళ్ళక పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకు ఏం జరిగింది తెలుసుకోవాలంటే మాత్రం వివరాల్లోకి వెళ్ళాల్సిందే. జూబ్లీహిల్స్ లోని  సింగడి బస్తీకి చెందిన స్థానిక నేత ఇజాజ్ అహ్మద్ పై రెండు నెలల క్రితం కొంతమంది కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇజాజ్ మహమ్మద్ తాజాగా చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఒక వారం రోజుల క్రితం బస్తీకి  వెళ్లగా స్థానికులు ర్యాలీ నిర్వహించారు. 

 

 

ఇక ఈ సందర్భంగా తీసిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలో ఆ వ్యక్తి ప్యాంట్  లో తుపాకీ ఉన్నట్లు కనిపించింది.వెంటనే అప్రమత్తమైన బంజారాహిల్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే అతని వద్ద ఉన్నది బొమ్మ తుపాకీ అని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తనకు ప్రాణభయం ఉండటంతోనే ఇలాంటివి  పెట్టుకుని తిరుగుతున్నాను అంటూ తెలిపాడు ఆ వ్యక్తి ఇలాంటి మరోసారి చేయొద్దంటూ పోలీసులు హెచ్చరించి పంపిణీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: