అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిరోజు అహ్మదాబాద్ మరియు ఆగ్రాలో పర్యటించారు. నిన్న తాజ్ మహల్ సందర్శన అనంతరం ట్రంప్ దంపతులు ఆగ్రా విమానశ్రయానికి వెళ్లి అక్కడినుండి ఢిల్లీకి విమానంలో బయలుదేరారు. నిన్న రాత్రి ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్ లో ట్రంప్ దంపతులు బస చేశారు. ఈరోజు ఉదయం రాష్ట్రపతి భవన్ సందర్శనతో ట్రంప్ టూర్ మొదలుకానుంది. 
 
నిన్న రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజు షెడ్యూల్ వివరాలను ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ కు ఈరోజు ఉదయం 10 గంటలకు స్వాగత కార్యక్రమం ఉంటుంది. 10.30 గంటలకు ట్రంప్ రాజ్ ఘాట్ లో మోదీతో కలిసి జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులర్పించనున్నారు. ఆ తరువాత సందర్శకుల పుస్తకంలో సందేశాన్ని రాసిన తరువాత ట్రంప్ హైదరాబాద్ హౌస్ కు బయలుదేరుతారు. 
 
హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ 11 గంటలకు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ద్వైపాక్షిక ఒప్పందాలపై మధ్యాహ్నం 12.40 గంటలకు సంతకాలు చేయనున్నారు. ఆ తరువాత ట్రంప్ మోదీ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాత్రి 7.30 గంటలకు ట్రంప్ కు విందు ఇవ్వనున్నారు.  ఆ తరువాత ట్రంప్ అమెరికా రాయబార సిబ్బందితో భేటీ కానున్నారు. 
 
రాత్రి 10 గంటలకు అమెరికాకు ట్రంప్ బృందం తిరుగుపయనం కానుంది. నిన్న ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ను చూసిన ట్రంప్ అక్కడి పరిసరాలను చూసి పులకించిపోయారు. తాజ్ అందాలను, నిర్మాణ కౌశలాన్ని, అక్కడి పరిసరాలను చూసి ట్రంప్ పులకించిపోయారు. దాదాపు గంట సమయం పాటు అక్కడే ఉండి ట్రంప్ దంపతులు తాజ్ మహల్ అందాలను వీక్షించారు.             
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: