ప్రపంచ దేశాలకు పెద్దన్న... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో భారత్ లో అడుగు పెట్టిన డోనాల్డ్ ట్రంప్ అనంతరం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి ఇక తర్వాత మోతేర  స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం తాజ్ మహల్ ను సందర్శించి ఆ తరువాత ఢిల్లీలోని ఓ హోటల్లో బస చేశారు. అయితే ఈ రోజు కూడా భారత్లో పర్యటించనున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అయితే ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

 

 

 ఈ విందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానం అందింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి తమిళనాడు కర్ణాటక తెలంగాణ ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. అయితే ఈ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విందు ఆహ్వానం అందింది కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి  మాత్రం ఆహ్వానం అందలేదు. అయితే దీనిపై అటు ఏపీ ప్రభుత్వం కూడా ఏమీ స్పందించలేదు. 

 

 

 అయితే  తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయిన సీఎం కేసీఆర్ కు విందుకు ఆహ్వానం అంది ... జగన్కు ఆహ్వానం అందకపోవడంకి వెనుక  ట్రంపు కుమార్తె ఇవంకనే  కారణమని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో హైదరాబాద్ లో పర్యటించిన ఇవాంకా కు కెసిఆర్ అద్భుత ఆతిథ్యం ఇచ్చారని అందుకే ఇవాంక సలహా మేరకు సీఎం కేసీఆర్ ను కలవాలని  ట్రంప్ ఆసక్తి ప్రదర్శించడం తోనే ఆహ్వానం అందింది అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే ప్రస్తుతం భారత్ అమెరికా సంబంధాల్లో హైదరాబాద్ బెంగళూరు చెన్నై ది కీలక పాత్ర అన్న విషయం తెలుసిందే. భారత్లో ఎంతో అభివృద్ధి చెందిన ఈ నగరాల్లో ఐటీ సంస్థలు బోలెడు ఉన్నాయి. ఇక ఈ ప్రాముఖ్యత రీత్యా తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది  అని రాజకీయ నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: