మనిషి ఒకప్పుడు ఇంటి తిండి ముద్దు.. బయట తిండి వద్దు అనేవారు.  ఇంట్లో చేసిన తల్లి, పెళ్లాం చేసే వంటలు తింటూ మంచి ఆరోగ్యంగా ఉండేవారు.  కానీ కాలం మారింది.. మనిషి నిత్యం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటున్నారు.. ప్రతిక్షణం చాలా విలువగా మారింది..దాంతో ఆహార విషయంలో కూడా చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తున్నాడు.  దాంతో బయట దొరిగే జంగ్ ఫుడ్స్ కి బాగా అలవాటు పడుతున్నారు.   జంక్ ఫుడ్ ఆరోగ్యానికి చాలా హానికరం మరియు దీని వలన శరీరంలో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి, స్థూలకాయత్వం కలుగుతుంది. వీటితో పాటూ జంక్ ఫుడ్’ను అధికంగా తీసుకోవటం వలన శ్వాస సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యలు , మధుమేహం వంటి ప్రమాదకర వ్యాధులు కలుగుతాయి.

 

తక్కువ టైంలో తయారుచేసే రెడీమెడ్ ఫుడ్ కు ఆకర్షితులవుతున్నారు. ఈ ఫాస్టు ఫుడ్ కల్చర్ రోజు రోజుకు పెరుగుతుంది. అయితే జంగ్ ఫుడ్స్ పై పరిశోధన సంస్థలు రీసెర్చ్ చేసి తాజాగా వెల్లడించిన విషయాలు ప్రతీ ఒక్కరిలో ఆందోళన ను రేపుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ కి బాగా అలవాటు పడ్డ వారిలో  సెర్మ్(వీర్యం) కౌంట్ చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుందని పరిశోధనలో వెల్లడైంది. 19ఏళ్ల సగటు వయస్సున్న 2900మందిపై పరిశోధన చేపట్టి తాజాగా వివరాలను వెల్లడించారు.  బీఫ్స్ స్నాక్ షుగరీ బేవరీ ఐటమ్స్ పాలిష్ చేసిన బియ్యం స్వీట్స్ తీసుకునే వారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ గా ఉన్నట్లు తేల్చి చెప్పారు. 

 

ఇక కూరగాయలు, తక్కువ ఆయిల్ ఫుడ్స్, చేపలు, చికెన్ తినే వారిలో స్పెర్మ్ కౌంట్ ఎక్కువు గా ఉన్నట్లు వెల్లడైంది. మొత్తానికి ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఊభకాయంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు కూాడా తలెత్తుతాయని పరిశోధన సంస్థలు పేర్కొంటున్నాయి. అంతే కాదు డానిష్ డైట్ తీసుకునే వారిలో అందరి కంటే తక్కువగా 146మిలియన్లు వెజిటేరియన్ డైట్ తీసుకునే వారిలో 151మిలియన్లు హెల్తీ డైట్ తీసుకునే వారిలో 167మిలియన్లు అత్యధికంగా స్పెర్మ్ కౌంట్ ఉత్పత్తి అయినట్లు పరిశోధనలో వెల్లడయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: