అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 36 గంటల పర్యటన కోసం భారత్‌కు చేరుకున్నారన్న విషయం తెలిసిందే.. ఇక రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అడుగడుగునా... ఘనస్వాగతం లభించింది. కాగా తొలిరోజు సబర్మతి ఆశ్రమ సందర్శన, మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. కాగా ఆగ్రాలో భార్య, కూతురు, అల్లుడు సమేతంగా తాజ్ మహల్ అందాల్ని ఆస్వాదించి, అక్కడి నుంచి ఢిల్లీ చేరుకుని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేయడంతో తొలిరోజు పర్యటన ముగిసింది.

 

 

ఇకపోతే ఈ అగ్రరాజ్యనేత ఇవాళ మరింత బిజీగా గడపనున్నారు.. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షులు ఎవరు భారత్ వచ్చిన సందర్భంలో సాధారణంగా విపక్షాల నేతలతో సమావేశం అవుతూ ఉంటారు. ఏ అమెరికా అధ్యక్షుడు అయినా సరే ఇప్పటి వరకు వాళ్ళను కలవడం ఒక ఆనవాయితీగా మారింది.. అయితే గతంలో వచ్చిన అమెరికా అధ్యక్షులు జార్జ్ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా ఇలా వచ్చిన వాళ్ళు అందరూ విపక్షాల నేతలతో  సమావేశం నిర్వహించారు. కాని ఇప్పుడు ట్రంప్ పర్యటనలో అలా జరగలేదు..

 

 

నమస్తే ట్రంప్ కార్యక్రమంలో భాగంగా మోడి భజన చేయడానికే ఆయన సమయం మొత్తం వెచ్చించారని, ట్రంప్ ప్రసంగంలో భారత్ అమెరికా సంబంధాలు, మోడీ చేస్తున్న పనులు మినహా ఏ ఒక్కటి ట్రంప్ ప్రస్తావించే ప్రయత్నం చేయలేదు. మోడీ టీ అమ్మి పైకి వచ్చిన విషయాన్ని అందరికి వినపడే విధంగా అరచి చెప్పారు. నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల కోసం ట్రంప్ ఈ టూర్ కి వచ్చారని, ప్రవాస భారతీయుల ఓట్లు కూడా మోడీకి కీలకం కానున్నాయని, తెలియకనే తెలుస్తుందనే ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి...

 

 

ఇదే కాకుండా హెచ్ 1 బి వీసాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన పాపాన పోలేదు  ట్రంప్.. కానీ మోడీ వచ్చిన తర్వాతే దేశంలో విజయాలు అనేవి మొదలయ్యాయి అన్నట్టు.. ట్రంప్ 8 వేల మైళ్ళ నుంచి వచ్చి మోడీ భజన చేసారని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయట.. ఏది ఏమైనా ఇక్కడ ట్రంప్‌ను డంప్ చేసి వాడుకున్న మోడీ విధానన్ని మోచ్చుకోక తప్పదంటున్నారు కొందరు..  

మరింత సమాచారం తెలుసుకోండి: