జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. విపక్ష పార్టీల కే కాదు అందరికీ భారీ షాక్ లు ఇస్తూ  చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది జగన్ సర్కార్. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏపీ ఎన్జీవో సంఘం గుర్తింపును రద్దు ఎందుకు చేయకూడదు చెప్పాలి అంటూ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. 2018 సంవత్సరంలో ఏపీఎన్జీవోలు తిరుపతి లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్జీవోల సంఘం సమావేశానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా మంత్రులు  హాజరయ్యారు. 

 


 ఈ నేపథ్యంలో ఎన్జీవోల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఎన్జీవో సంఘంలో సభ్యులు కాని వాళ్లు ఎన్జీవో సదస్సు లో ఎలా పాల్గొంటారు అంటూ ఎన్జీవో అధ్యక్షుడు కి ఏపీ సీఎస్ లేఖ రాశారు. సభ్యులు కాని వారు ఎలా సదస్సులో పాల్గొంటారు అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఏపీఎన్జీవో బైలాస్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లేదని కొత్త సభ్యుల వివరాలను ఏపీఎన్జీవోలు నమోదు చేయడం లేదంటూ లేఖలో ప్రశ్నించారు. అంతేకాకుండా ఏపీ ఎన్జీవోలకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఏపీఎన్జీవో సభ్యులందరూ దుర్వినియోగం చేస్తున్నారని ఏపీ సి ఎస్ ఏపీ ఎన్జీవోల సంఘం నాయకుడికి లేఖ రాశారు. 

 


 ఇక ఏపీ ప్రభుత్వం రాసిన ఈ లేఖ సంచలనంగా మారింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక మరో కారణం కూడా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు ఆ తర్వాత టిడిపి తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్సీ అయిన అశోక్ బాబు కు ఎన్జీవోల సంఘంలో మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే తాజా ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కారణాలు ఏమైనా ప్రస్తుతం ఎన్జీవో సంఘం రద్దు చేయకపోవడానికి కారణాలేమిటో తెలపాలంటూ ఏపీ సిఎస్ ఎన్జీవో సంఘం నాయకుడు కి లేఖ రాయడం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం గా మారగా...  ఈ పరిణామాలు ఎక్కడ వరకు దారి తీస్తాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎన్జీవో సభ్యులందరూ కలిసి సమిష్టిగా కొనసాగించేందుకు నడుం బిగిస్తారా లేక ఇంకేదైనా జరుగుతుందా అనేది కూడా ఆసక్తిగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: