అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతుల రెండు రోజుల భారత్ పర్యటనలో ఓ విషయంలో మాత్రం యావత్ దేశం నరేంద్రమోడి అంటే విపరీతంగా ఫిదా అయిపోయింది. అదేమిటంటే నేటివిటిని పాటించటం. గుజరాత్ లో ట్రంప్ ప్రారంభించిన మొతేరా క్రికెట్ స్టేడియంలో జరిగిన బహిరంగసభలో అయినా ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో జరిగిన కీలక చర్చల్లో కూడా మోడి నేటివిటిని వదలకపోవటం.

 

ఇంతకీ నేటివిటి అంటే ఏమిటని అనుకుంటున్నారా ? అదేనండి హింది భాషలో మాత్రమే మాట్లాడటం. మొతేరా స్టేడియంలో సుమారు 20 నిముషాల పాటు మోడి మాట్లాడారు. తర్వాత సోమవారం ఉదయం అమెరికా-భారత్ మధ్య రక్షణ రంగం విషయంలో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ట్రంప్, మోడి తో పాటు రెండు దేశాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తర్వాత ట్రంప్, మోడి ప్రెస్ మీట్ కూడా జాయింట్ గానే అడ్రస్ చేశారు.

 

ప్రెస్ మీట్ లో దాదాపు పది నిముషాలు మాట్లాడిన మోడి పూర్తిగా హిందీలోనే మాట్లాడడటం చాలామందిని ఆకట్టుకుంది. మామూలుగా మనకన్నా పై స్ధాయిలో వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చినపుడు వచ్చినా రాకపోయినా వాళ్ళ భాషలోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తాం. కానీ మోడి మాత్రం అటువంటి భేషజాలకు పోకుండా కేవలం హిందీలోనే మాట్లాడారు. కాకపోతే తాను మాట్లాడింది ట్రంప్ కు అర్ధం అయ్యేందుకు ఓ ట్రాన్స్ టేటర్ ను పెట్టుకున్నారు.

 

 మామూలుగా ట్రాన్స్ లేటర్లను చైనా, జపాన్ లాంటి దేశాధినేతల పర్యటనల్లోనే చూస్తుంటాం. కానీ మోడి వాళ్ళ సేవలను చక్కగా ఉపయోగించుకున్నారు. అమెరికా పర్యటనలో కూడా మోడి హిందీలోనే ప్రసంగించిన విషయం మరచిపోకూడదు. మోడికి గుజరాతీ, హిందీ తప్ప ఇంగ్లీషు రాదనే అనుకుందాం. కానీ అధికారులు రాసిచ్చిన ఇంగ్లీషును చదవలేనంత స్ధితిలో అయితే లేరన్నది వాస్తవం. అయినా కానీ మాతృభాషలో మాట్లాడేటపుడు ఉన్న సౌలభ్యం పరాయిభాష మాట్లాడేటపుడు ఉండదన్నది నిజం. ఈ నిజం తెలిసు కాబట్టే మోడి కేవలం నేటివిటీని ఫాలో అయిపోయారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: