ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల  రగడ ఇంకా రగులుతూనే ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణకు సంబంధించి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్ర రాజకీయాలన్నీ అల్లకల్లోలం అవుతున్నాయి.  ఇక జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓవైపు విపక్ష పార్టీలన్ని  తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటే మరోవైపు అమరావతి లో రైతులు నిరసన బాట పట్టారు. అయితే ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి సర్కారు 3 రాజధానిల  ప్రకటన చేసి ఎన్నో  రోజులు అయినప్పటికీ అమరావతి రైతులు మాత్రం తమ ఉద్యమాన్ని ఆపడం లేదు ఇప్పటికే అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 70 రోజులకు చేరుకుంది. 

 

 

 ఆంధ్రప్రదేశ్ రాజధానిగా  అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి రైతులు మహిళలు ఆందోళన చేస్తున్నారు. రోజురోజుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ విభిన్న రీతిలో నిరసన తెలియ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక తాజాగా అమరావతి ఆందోళనలో భాగంగా అక్కడి మహిళలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోటోతో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ పలు నినాదాలు చేశారు అమరావతి మహిళలు. అమెరికాకు రాజధాని ఒకటే ఉన్నది కానీ సీఎం జగన్ మాత్రం మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నిరసనలు వ్యక్తం చేశారు. అమరావతి మార్పు విషయంలో సీఎం జగన్ మనసు మార్చుకోవాలి అంటూ కోరారు. 

 

 

 ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తమ ఉద్యమం ఆగదు అంటూ స్పష్టం చేశారు. ఇప్పటికీ అమరావతిలో రైతులు ఆందోళనలు 70 వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికీ మందడం  తుళ్ళూరు పెనుమాక ఎర్రబాలెం కృష్ణాయపాలెం రాయపూడి నేలపాడు తాడికొండ అడ్డరోడ్డు 14వ మైలు లలో  రైతులు ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ధర్నాలు ఆందోళనలు చేస్తున్న రైతులందరూ జగన్ ప్రభుత్వం మూడు రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తమ ఉద్యమాన్ని విరమించి లేదంటూ తేల్చి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: