వాహనదారులు కొత్త వాహనం కొన్నారు అంటే... తమ కొత్త వాహనం కోసం ఏదైనా ఫాన్సీ నెంబర్ వస్తే బాగుండు అని అనుకొని వాహనదారులు ఉండరు. అయితే ఇలా అనుకునే వారు సామాన్య ప్రజలు మాత్రమే... కానీ బాగా ధనికులు అయితే ఎంత ఖర్చయినా తమ వాహనానికి ఫ్యాన్సీ నెంబర్ కావాల్సిందే అంటూ ఉంటారు. సామాన్యులలో కూడా కొంతమంది ఫ్యాన్సీ నెంబర్ కోసం భారీగానే ఖర్చు పెడుతుంటారు. ఇంతకీ ఫాన్సీ నెంబర్ మీద ఎందుకు అంత ఆసక్తి అంటే... ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్... కొంతమంది తమ వాహనానికి ఫాన్సీ నెంబర్ ఉంటే అది ఒక స్పెషల్ ఎట్రాక్షన్ గా భావిస్తారు. ఇంకొంతమంది క్రేజ్ కోసం నెంబర్ పెట్టు కుంటారు మరికొంతమంది న్యూమరాలజీ నమ్మేవారు ఫాన్సీ నెంబర్లు తీసుకుంటూ ఉంటారు. 

 

 

 ఇక ఈ మధ్య కాలంలో అయితే ఫాన్సీ నెంబర్లు పెట్టుకునేందుకు మరి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు జనాలు. ఫాన్సీ నెంబర్లు అంటే అటు ప్రభుత్వం ఏమైనా తక్కువ తింటున్న ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే అలా వసూలు చేస్తోంది. ఇప్పటికే ఫాన్సీ నెంబర్ లు బాగానే ధర పలుకుతున్నాయి. ఏకంగా 9999 నెంబర్ ఈసారి రికార్డు స్థాయిలో 11 లక్షల రూపాయలు పలికింది. దీంతో రోజురోజుకు ఫాన్సీ నెంబర్ పై ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగిపోతుంది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత... కేవలం ఫ్యాన్సీ నెంబర్లు ద్వారానే తెలంగాణ ప్రభుత్వానికి 236.73 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ప్రతి ఏటా ఈ ఆదాయం రెట్టింపు అవుతుంది. 

 

 

 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేవలం ఫాన్సీ నెంబర్లు ద్వారా వచ్చిన ఆదాయం రెట్టింపు అయ్యింది. 55.58 కోట్ల ఆర్థిక ఆదాయం వచ్చింది ఫ్యాన్సీ నెంబర్ ద్వారా. ఇక 2017-18 సంవత్సరాలు 45.46 కోట్లు, 2016-17 సంవత్సరంలో 39.25 కోట్లు,  2015-16 సంవత్సరాలు 301.11 కోట్ల ఆదాయానికి వచ్చింది. ఇక అత్యల్పంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలో 22.63 కోట్ల ఆదాయం వచ్చింది. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలోనే ఈ ఫ్యాన్సీ నెంబర్ నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఇక ఈ ఫ్యాన్సీ నెంబర్లు ఎక్కువ ఆదాయం వస్తున్నా కార్యాలయాలు ఖైరతాబాద్ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం మేడ్చల్ ఉప్పల్ సికింద్రాబాద్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఇక ఇటీవల ఫాన్సీ నెంబర్ల పై వాహనదారులు ఎక్కువ మొగ్గుచూపుతుండటంతో ఆదాయం రోజురోజుకు రెట్టింపవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: