కేటీఆర్ రాజకీయ వారసులైన కల్వకుంట్ల కవిత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎలాంటి పదవి లేకుండానే ఉంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడ తెరమీద కనిపించిన దాఖలాలు కూడా సరిగ్గా లేవు. కానీ గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో  కవిత కు సంబంధించి కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంకొన్ని రోజుల్లో తెలంగాణలో పలు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలు ఎవరికి కేటాయించబోతుంది  అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాజ్యసభ స్థానాల్లో కొనసాగుతున్న వారికే మళ్లీ కేటాయిస్తార లేదా కొత్త వాళ్ళకు ఇస్తారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే కెసిఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత కు రాజ్యసభ కు పంపిస్తారు అనే అంశం కూడా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

 

 

 అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ లో నెలకొన్న సైలెన్స్ ను బట్టి చూస్తుంటే కేసిఆర్ కూతురు కవిత కి రాజ్యసభ సీటు లేనట్లే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ కవిత కు కు రాజ్యసభ సీటు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తే.. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలందరూ దీనికి సంబంధించిన పలు సంకేతాలు కూడా ఇచ్చేవారు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఒకవేళ కవిత పెద్దల సభకు వెళ్లడం నిజమైతే నిజాంబాద్ లో ఇప్పటికి హడావిడి కనిపించేదనీ టాక్ వినిపిస్తోంది. రాజ్యసభకు కవిత వెళ్లడం లేదు కాబట్టి ఎలాంటి హడావుడి లేదు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కవితను రాజ్యసభకు పంపకుంటే... కవిత రాజకీయ భవిష్యత్తు విషయంలో కేసీఆర్ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై కూడా పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

 

 

కవితను  మరో నాలుగేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉంచడం సాధ్యం కాకపోవచ్చని.... అందుకే కవితను రాష్ట్ర రాజకీయాల్లో ఇన్వాల్వ్  చేయాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు  ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది తన రాజకీయ వారసుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనలో ఉన్న కేసీఆర్... తెలంగాణ క్యాబినెట్ లో  కవిత కు మంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కవితకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి కవితను మంత్రిని చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట ముఖ్యమంత్రి కేసీఆర్.మరి కవిత రాజ్యసభకు వెళ్లి పెద్దల సభలో స్వరం వినిపిస్తుందా లేదా తెలంగాణ రాజకీయాల్లో మంత్రి గా మారి కీలకంగా మారుతుంద అనేది తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: