కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ ఆందోళనల సమయంలో చెలరేగిన హింసలో మరణించినవారి సంఖ్య ఎనిమిది మంది చేరింది. భజన్ పూరాలో ఇరు వర్గాల మద్య పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళన నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లు మూసి వేశారు. ఈ ఘటనలో ఇప్పటికే పలువురికి తీవ్ర గాయాలు కాగా అందులో ఇద్దరు విలేకరుల పరిస్థితి విషమంగా ఉంది. ఇక ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో ఆందోళనకారుల రాళ్ల దాడులు, దుకాణాల విధ్వంసం, పోలీసుల లాఠీ చార్జి కొనసాగుతున్నాయి. దుకాణాలు, టైర్లు తగలబెట్టడంతో పలు ప్రాంతాల్లో పొగ కమ్ముకుంది. పరస్పర దాడుల్లో వందల మందికి గాయాలు అయ్యాయి.

 

అల్లర్లను అదుపు చేయాలంలో ఆర్మీని రప్పించాలని సీఎం కేజ్రీవాల్ కోరుతున్నారు.  ప్రధానంగా జఫరాబాద్, మౌజ్ పూర్, చాంద్ బాగ్, ఖురేజీ ఖాస్, భజన్ పురా ప్రాంతాల్లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య దాడులు సాగుతున్నాయి. కాగా, ఎన్డీయే ప్రభుత్వం సీఏఏ తీసుకురావడం పట్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రతిరోజూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.  తాజాగా దీనిపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. సీఏఏ వ్యతిరేక హింసను అదుపు చేసేందుకు సైన్యాన్ని పిలవాలని, ఈ దిశగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సలహా ఇవ్వాలని సూచించారు.

 

ఇలాంటి అల్లర్ల వల్ల దేశంలో అహింస మరింత చెలరేగుతుందని.. అసాంఘీక శక్తులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఇలాంటి అల్లర్ల అణచివేతకు సైన్యాన్ని రంగంలోకి దింపడం ప్రజాస్వామ్య సంప్రదాయపరంగా తీవ్ర చర్యే అయినా, హింసను రూపుమాపి ముఖ్యంగా ప్రజాస్వామ్యం కొనసాగేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు.  గత 35 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఇప్పుడిలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: