విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి వి సత్యనారాయణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎం వి వి సత్యనారాయణ చేసిన పనికి ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే విశాఖను రాజధానిగా ప్రకటించి జగన్ కీలక నిర్ణయం తీసుకోవడంతో ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషంగా పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖ మరింతగా అభివృద్ధి చెందుతుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ ఎంపీ తీసుకున్న చొరవకు అటు ప్రజలు, వ్యాపారులు ఆనందంలో ఉన్నారు. దీనికి కారణం విశాఖ కు తొలిసారిగా కార్గో సర్వీసులు నడిపేందుకు రక్షణశాఖ అనుమతి వచ్చింది. ఈ మేరకు ఈ నెల 25  వ తేదీ నుంచి తొలిసారిగా ఈ సర్వీస్ లు నడిపించేలా సన్నాహాలు చేస్తున్నారు. 

IHG


మొదటిసారిగా విశాఖ నుంచి చెన్నై,  కలకత్తా తదితర ప్రాంతాలకు నడిపేందుకు స్పైస్జెట్ విమాన సంస్థ అంగీకరించింది. ఈ మేరకు విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ నుంచి కార్గో విమాన సర్వీసులు ప్రారంభించాలని చాలాకాలంగా వ్యాపారులు కోరుతున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికులు సంఘం వివిధ విమాన సంస్థల ప్రతినిధులతో చర్చిస్తున్నారు. అయితే దీనికి రక్షణ శాఖ అధికారుల నుంచి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం అయింది. దీని కారణంగా ఈ వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. ఈ సమస్యను విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన విశాఖ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు కార్గో విమాన సర్వీసులు నడపాలని సత్యనారాయణ కేంద్ర రక్షణ శాఖ మంత్రికి గతంలోనే లేఖ రాశారు.


 ఆ  తర్వాత కేంద్రం మంత్రులను కూడా కలిసి ఈ విషయమై చర్చించారు. ఆయనతోపాటు ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కె.కుమార్‌ రాజా, డి.ఎస్‌.వర్మ, ఒ.నరేష్‌కుమార్‌ తదితరులు కార్గో సర్వీసులు విశాఖలో ఏర్పాటు అయ్యేలా గట్టిగా కృషి చేయడంతో ఈ సర్వీసుల త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటివరకు ఈ సర్వీసులు అందుబాటులోకి రాకపోవడం వల్ల రోడ్డు, రైలు మార్గాల ద్వారా వివిధ ప్రాంతాల నుంచి సరుకుల రవాణా ఎగుమతులు, దిగుమతులు చేసుకునేవారు. ముఖ్యంగా విమాన కార్గో సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల ఎక్కువ లబ్ది పొందేది ఫార్మా కంపెనీలే.

మరింత సమాచారం తెలుసుకోండి: