ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడానికి వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని... దీనికోసం 3 రాజధానిలు  నిర్మించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో ఆమోద ముద్ర కూడా వేయించింది  జగన్ సర్కార్. అయితే ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి నిర్ణయంపై ప్రతిపక్షాల లోనే కాదు అటు వైసిపిలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు  తెలుస్తోంది. అయితే తాజాగా హైదరాబాద్లో వ్యాపారాల కోసమే 3 రాజధాని లకు తాము మద్దతు ప్రకటిస్తున్నాము అంటూ మాజీమంత్రి టీడీపీ నేత ఉమామహేశ్వర వ్యాఖ్యానించడం సంచలనం గా మారిన విషయం తెలిసిందే. 

 

 

 అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మాజీమంత్రి వైసీపీ ఎమ్మెల్యే వసంత నాగేశ్వరరావు. దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. తాజాగా విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన వసంత నాగేశ్వరరావు... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తాను తన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయాల్లో  నీతి నిజాయితీలతో పని చేస్తున్నాము అంటూ ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానిల  ప్రతిపాదన తెరమీదకు తెచ్చినపుడు తామిద్దరం ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లి ఈ ప్రతిపాదన తమకు ఇష్టం లేదు అంటూ చెప్పామని... మూడు రాజధానిల నిర్ణయాన్ని తమ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అంటూ నిర్భయంగా చెప్పాము  అంటూ సంచలన నిజాలు బయటపెట్టారు. దీనికి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే పాదయాత్రకు సహకరించామని తెలిపారు. 

 

 

 అయితే మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు తమ కుటుంబంపై బురద చల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆయన ఆరోపించారు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యే వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి. అయితే ఇదిలా ఉంచితే అటు అమరావతి లో కూడా మూడు రాజధానిల నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని రైతుల చేపడుతున్న నిరసనలు  70వ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. జగన్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని రాజధాని రైతులు స్పష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: