పిల్లలమీద ఉన్న ప్రేమ ఒక్కోసారి వారి ప్రాణాలను తీస్తుందని నిరూపిస్తున్న ఈ సంఘటన, నిజంగా మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తిని కదిలిస్తుంది... ఎందుకంటే అమాయకమైన ముఖాన్ని, కల్మషం లేని నవ్వులను వెంటేసుకుని కనిపించే పసిపిల్లలను చూస్తే ఎవరికైనా ముచ్చట వేస్తుంది. బుడిబుడి అడుగులతో, చిలకలాంటి పలుకులతో చిన్నారులు ఇంట్లో తిరుగుతుంటే కలిగే ఆనందం ఎన్ని కోట్లు పెట్టిన దొరకదనిపిస్తుంది..

 

 

ఒక తల్లి పిల్లలను కనడానికి ఎంతలా ప్రసవ వేదనపడుతుందో, వారు పుట్టాక ఆ పిల్లలను చేతిలోకి తీసుకోగానే అంతవరకు పడిన బాధను ఆ క్షణం నుండి మరచిపోతుంది. అదే ఆ నలుసుకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే.. నిజంగా ఆ తల్లిగుండే తట్టుకుని బ్రతకడం అన్నది మహా కష్టం.. ఇంతటి ప్రేమలకు నిలయమైన పసిపిల్లలు పెరిగి పెద్దవారైనాక తల్లిదండ్రులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరం.. ఇకపోతే తండ్రిమీదున్న ప్రేమ ఓ చిన్నారి పాలిట శాపమై, అనంతలోకాలకు తీసుకెళ్లింది.. ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

బార్కస్‌ సలాలా ప్రాంతంలో కారు డ్రైవర్‌ ఖాలెద్‌ సారి (28)కి ముద్దులొలికే 18 నెలల  కుమార్తె హుదా సారి ఉంది. అయితే ఇతని ఆన్న కుమార్తెకు వివాహం నిశ్చయం అవగా, దానికి సంబంధించిన వేడుకను ఏర్పాటు చేశారు.. ఈ వేడుకకు అతిధులంత హజరై ఆనందోత్సావాల మధ్య ఆ పార్టీని ముగించారు.. కాగా వేడుకకు వచ్చిన దగ్గరి బంధువులను వారి ఇళ్ల వద్ద దింపేందుకు ఖాలెద్‌ తన కారును బయటకు తీశారు. ఇక అందరూ కారు ఎక్కారని నిర్దారణకు వచ్చిన తర్వాత ఇతను తన కారుని మెల్లగా ముందుకు పోనిచ్చాడు..

 

 

అయితే అదే సమయంలో, ఖాలెద్ కూతురు తండ్రిదగ్గరకు పరిగెత్తుకుంటు వచ్చింది.. పాపం తండ్రిని ఎటువైపునుండి చుట్టేయాలో అర్ధం కాని ఆ పసిది బుడి బుడి అడుగులతో కారుకు ఎడమవైపు రాగా, అది కనిపించని ఆ తండ్రి కారును అలాగే పోనిచ్చాడు.. పక్క వారు అరవడంతో వెంటనే కారు ఆపిన ఆ తండ్రి కిందికి దిగి చూడగా అప్పటికే ఆ చిన్నారి తీవ్ర రక్తస్రావంతో చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.

 

 

ఏదో ఆశతో తన బిడ్దను బ్రతికించుకోవాలని ఆ తండ్రి హస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే హుదాసారి మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. కాగా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి.. చిన్నారికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పారు. అప్పటివరకు కళ్లముందు తిరిగిన ముద్దులొలికే చిన్నారి ఇకనుండి తమ మధ్య లేకపోవడంతో.. ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: