అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల ప‌ర్య‌ట‌న అంతా గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న భార్య మెల‌నియాతో పాటు కుమార్తె, అల్లుడుతో పాటు అమెరికాలో కీల‌క అధికారులు అంద‌రూ వ‌చ్చారు. అయితే ఎంత‌మంది వ‌చ్చినా టోట‌ల్ ట్రంప్ ప‌ర్య‌ట‌న‌కే ఒకే ఒక్క వ్య‌క్తి హైలెట్‌గా నిలిచారు. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు స్వ‌యానా ట్రంప్ కుమార్తె. ట్రంప్‌ కుమార్తె, ఆయన సలహాదారు అయిన ఇవాంక ట్రంప్ తొలి రోజు, రెండో కూడా హైలెట్‌గా నిలిచారు.



తొలి రోజు రెడ్ క‌ల‌ర్ మిడ్ డ్రెస్ వేసుకుని ఆక‌ర్షించే చూపుల‌తో అంద‌రిని త‌న వైపున‌కు తిప్పుకున్న ఇవాంకా ట్రంప్ రెండో రోజు కూడా టోట‌ల్ టూర్ కే హైలెట్‌గా నిలిచారు. రెండవ రోజు తెలుపు రంగు సూట్‌ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉదయం అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ వెనుక తన భర్త జరెద్ కుష్నర్‌తో కలిసి ఇవాంక రాష్ట్రపతి భవన్ వద్దకు వచ్చారు. ఈ సారి కాస్త డిఫరెంట్‌గా తెలుపు రంగు సూట్‌ ధరించారు.



ఇక ఇవాంకా ట్రంప్ వ‌య‌స్సు 37 సంవ‌త్స‌రాలు. అయితే ఆమెను చూస్తే అంత వ‌య‌స్సు ఉంద‌ని ఎవ్వ‌రికి అనిపించ‌దు. ఇవాంకా రెండో రోజు వేసుకున్న డ్రెస్ ఇండో వెస్ట్రన్ డిజైనర్ అనితా డొంగ్రే ఈ షేర్వానీని డిజైన్ చేశారు. రెండు రోజులు కూడా ఆమె వేసుకున్న అంద‌మైన డ్రెస్సుల‌తో త‌న న‌వ్వుల‌తో చూపుల‌తో అంద‌రిని త‌న వైపున‌కు తిప్పుకున్నారు.



ఆమె గ‌తంలో కూడా హైద‌రాబాద్‌లో ఓ స‌ద‌స్సులో పాల్గొనేందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇవాంకా రెండో రోజు వేసుకున్న డ్రెస్సు పశ్చిమబెంగాల్‌కి చెందిన ముర్షిదాబాద్ పట్టుతో షేర్వానీని అందంగా డిజైన్‌ చేశారు. దీనికి మెటాలిక్ బటన్లను పొందుపరిచారు. స్లీవ్‌లెస్ కాకుండా తెలుగు రంగు సూట్‌తో పాటు స్ట్రెయిట్ ఫీట్ గల తెల్లని ప్యాంట్‌ను ఇవాంక ధరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: