ట్రంప్ ఎవరు అంటే ఎవరైనా అమెరికా అధ్యక్షుడనే చెబుతారు. కానీ అంతకు ముందు.. ట్రంప్ ఎవరు.. ట్రంప్ ఓ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాదు. ట్రంప్ ఓ విజయవంతమైన వ్యాపార వేత్త. అనేక కంపెనీలను ఆయన స్థాపించారు. విజయపథంలో నడిపించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అనూహ్యంగా అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు.

 

ఆ విషయాలన్నీ ఓకే.. ఇంతకూ జగన్ కూ ట్రంప్ కూ పోలిక ఏంటి.. అసలు వీరిద్దరికీ లింక్ ఏంటి ఇదే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నా.. అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న. కానీ ఆ పేరు కోసం అమెరికా చాలా కోల్పోతోంది. అనవసరంగా పేరు కోసం.. తనకు పెద్దగా సంబంధం లేని విషయాల్లో కూడా సైన్యం కోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తోంది. ఓ వ్యాపారవేత్తగా ఇది ట్రంప్ కు నచ్చలేదు.

 

అలాగే.. ట్రంప్ అధికారం చేపట్టగానే ఏం చేశాడు.. మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ నినాదంతో మిత్రదేశం.. శత్రుదేశం అంటూ తేడా చూపించకుండా అందరిపై వాణిజ్య ఆంక్షలు విధించారు. మాతో వ్యాపారం కావాలంటే మాకేమిస్తారు.. మీరేం వదులుకుంటారు.. ఇదే సూత్రం పాటించారు. అంతే చైనా.. ఐరోపా.. భారత్‌.. మెక్సికో.. కెనడా.. ఇలా ట్రంప్‌ దెబ్బకు చాలా దేశాలు అవస్థలు పడుతున్నాయి. ఆఫీస్‌లోకి వచ్చీ రాగానే వాణిజ్య ఒప్పందాల పునఃసమీక్ష మొదలుపెట్టారు.

 

సరిగ్గా ఏపీ సీఎం జగన్ కూడా ఇలాగే చేశాడు.. మోహమాటాలకు పోకుండా.. రాష్ట్రానికి నష్టం చేకూర్చే ఒప్పందాలను సమీక్షిస్తానన్నాడు. కాంట్రాక్టులన్నీ తిరిగతోడుతున్నాడు. రివర్స్ టెండరింగ్ అంటూ కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. మొత్తానికి ఓ వెయ్యి కోట్లకు పైగానే రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేశాడు. సో.. అమెరికా ట్రంపైనా ఆంధ్రా జగనైనా.. ఒక్కటే నినాదం.. అమెరికా ఫస్ట్ అని ట్రంప్ అంటే.. ఆంధ్రా ఇంట్రస్టే ఫస్ట్ అని జగన్ అంటున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: