వైయస్ జగన్ ప్రకటిస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా సంచలనం గా మారుతున్నాయి. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా పరిపాలించడం నిజంగా చాలా ఆశ్చర్యం అని జగన్ పరిపాలన గురించి జాతీయ స్థాయిలో నాయకులు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. ముఖ్యంగా దిశ చట్టం అదేవిధంగా రివర్స్ టెండరింగ్ వంటి నిర్ణయాలతో దేశవ్యాప్తంగా జగన్ తొమ్మిది నెలల పరిపాలనలో హైలెట్ అయిపోయారు.

 

దేశ రాజకీయ ముఖచిత్రం గురించి జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తున్న సమయంలో దక్షిణాదిలో తిరుగులేని పొలిటికల్ లీడర్ జగన్ అంటూ అప్పుడే ట్యాగ్ లైన్ పెట్టేస్తున్నారు. తనకు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసుకుని ప్రజలను అద్భుతంగా పరిపాలిస్తున్నాడు అని భవిష్యత్తులో భారత దేశ రాజకీయాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చుట్టూ తిప్పే స్థాయికి తీసుకెళ్లా కలిగే పొలిటికల్ లీడర్ జగన్ అంటూ అభివర్ణిస్తున్నారు.

 

గతంలో తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వల్ల యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో రెండు సార్లు ఏ విధంగా ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగిందో అదే రోజులు భవిష్యత్తులో జగన్ తీసుకొస్తారని జాతీయ మీడియా ఛానల్స్ పేర్కొంటున్నాయి. కాగా ఇటీవల విజయనగరం జిల్లాలో జగన్ కొత్తగా ప్రవేశపెట్టిన ‘జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన’ కార్యక్రమం మరొక హైలెట్ పథకం గా నిలిచింది. ఈ నేపథ్యంలో విజయనగరంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మరియు అందిస్తున్న సంక్షేమలకు అటుగా వస్తున్న ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.

 

‘పేదల సంక్షేమం‌ కోసం శ్రమిస్తున్న మా ప్రభుత్వంపై కొందరు నిత్యం విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో 25 లక్షల‌ మంది‌ నిరుపేదలకి రికార్డు స్థాయిలో ఉగాదికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతుంటే కొన్ని పత్రికలు, మీడియాల తప్పుడు ప్రచారాన్ని ఏమనాలి. చంద్రబాబును ప్రజలు మరిచిపోతారనే భయంతోనే ఆ పత్రికలు, ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఏ తప్పు చేయకపోయినా రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తోంది` అని చెప్పారు.

 

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా రావడంతో చాలా మంది నెటిజన్లు మీ గవర్నమెంట్ కి తిరుగులేదు ఎవరిని పట్టించుకోవద్దు జగన్ గారు అంటూ చాలామంది జగన్ చేసిన కామెంట్లతో ఏకీభవిస్తున్నారు. ఇదే సమయంలో తొమ్మిది నెలల తన పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా చేయించుకున్న సర్వేలో గతంలో కంటే మరింత గ్రాఫ్ పెరగటంతో జగన్ దూకుడు మీద ప్రతిపక్షాలపై విమర్శలు చేసినట్లు సమాచారం. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: